డిజే దువ్వాడ జగన్నాధం తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ తన కొత్త సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయనున్నాడు. స్క్రిప్ట్ గతంలోనే సిద్ధమైనప్పటికి మల్టీ స్టారర్ కాన్సెప్ట్ కావడంతో హీరోలను సెట్ చేసుకోవడంలో కాస్త టైం పట్టింది. ఫైనల్ గా ఇందులో నితిన్, శర్వానంద్ లు ఫిక్స్ కావడంతో జూలై నుంది ఇది పట్టాలెక్కే అవకాశం ఉంది. దీనికి టైటిల్ కూడా దాగుడుమూతలు అని డిసైడ్ అయినట్టు సమాచారం. వీళ్ళ కన్నా ముందే హరీష్ శంకర్ నానిని ట్రై చేసినట్టు టాక్ ఉంది కాని న్యాచురల్ స్టార్ అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. నితిన్ దిల్ రాజునే నిర్మిస్తున్న 'శ్రీనివాస కళ్యాణం' షూటింగ్ లో బిజీగా ఉండగా శర్వానంద్ హను రాఘవపూడి తీస్తున్న 'పడి పడి లేచే మనసు'లో ఎంగేజ్ అయ్యాడు. ఈ రెండు పూర్తయ్యాకే దాగుడుమూతలు సెట్స్ పైకి వెళ్తుంది.
ఇది రెండు జంటల మధ్య జరిగే ఫక్తు ఎంటర్ టైనర్ మూవీగా తెలిసింది. అసలే మల్టీ స్టారర్ ట్రెండ్ టాలీవుడ్ లో మహా జోరుగా సాగుతోంది. ఎన్నడు లేని రీతిలో ఈ సంవత్సరం క్రేజీ కాంబోలు తెరకెక్కుతున్నాయి. చరణ్-తారక్ తో రాజమౌళి డ్రీం వెంచర్, వెంకీ వరుణ్ తేజ్ చేస్తున్న ఎఫ్2, వెంకటేష్ నాగ చైతన్యతో బాబీ తీసే మూవీ, తేజ దర్శకత్వంలో వెంకటేష్-నారా రోహిత్ కాంబో - నాగార్జున-నానితో శ్రీరామ్ ఆదిత్య మూవీ ఇప్పుడు ఈ సిరీస్ లో దాగుడుమూతలు కూడా జాయిన్ కాబోతోంది. నితిన్ శర్వానంద్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు కాబట్టి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఆసక్తి రేపేదే అవుతుంది. షూటింగ్ జూన్ లో మొదలుపెట్టి ఏడాది చివరికంతా విడుదల ప్లాన్ చేసేలా ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది. రకుల్ ప్రీత్ సింగ్ - నివేదా థామస్ హీరొయిన్లు గా చేయొచ్చు అనే టాక్ ఉంది కాని అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.