‘డీజే’ డిస్ లైక్స్.. హరీష్ హర్టయినట్లున్నాడే

Update: 2017-02-28 05:32 GMT
కొన్ని విషయాలు ముందు సరదాగా అనిపిస్తాయి. కానీ తర్వాత అవే సీరియస్ గా మారతాయి. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా టీజర్ కు అదే పనిగా డిస్ లైక్స్ కొట్టడం ఇప్పుడు సీరియస్ ఇష్యూ అవుతున్నట్లే ఉంది. దీనికి ముందు పవన్ అభిమానులు.. బన్నీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే సరదాగానే తీసుకున్నారు. పెద్దగా పట్టించుకోలేదు. కానీ బన్నీ పట్ల పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకత హెచ్చు స్థాయికే వెళ్లిందని.. వాళ్లు అతడి విషయంలో రగిలిపోతున్నారని ‘డీజే’ టీజర్ కు వచ్చిన డిస్ లైక్స్ ను బట్టే అర్థమవుతోంది. ఈ విషయంలో ‘డీజే’ దర్శకుడు హరీష్ శంకర్ సైతం హర్టయినట్లున్నాడు.

‘డీజే’ టీజర్ 5 మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో హరీష్ ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ చూస్తే యాంటీ ఫ్యాన్స్ పట్ల అతను అసంతృప్తితో ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే..’’ అనే శ్రీశ్రీ కవితను కోట్ చేయడంలో హరీష్ ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. అలాగే ‘థ్యాంక్స్ ఫర్ దట్ వ్యూస్.. దిస్ లైక్స్.. యత్భవం తద్భవతి’’ అంటూ ట్వీట్ కూడా జోడించాడు హరీష్. పర్టికులర్ గా ‘లైక్స్’ గురించి కూడా ప్రస్తావించాడంటే ‘డిస్ లైక్స్’ గురించి చెప్పకనే చెప్పినట్లే. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ కు పని చేశానన్న సంగతి కూడా మరిచి తన సినిమా మీద వ్యతిరేక ప్రచారం చేస్తే హరీష్ హర్టవకుండా ఉంటాడా మరి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News