హరీష్ శంకర్ ఇలా బయట పడ్డాడేంటి..!

Update: 2023-05-02 16:40 GMT
ఈమధ్య స్టార్ డైరెక్టర్స్ కి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. తాము స్టార్ డైరెక్టర్ గా అవడమే కాదు వారి దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ లకు అవకాశాలను అందిస్తూ వారి సక్సెస్ లో కూడా భాగం అవుతున్నారు. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి తన శిష్యులను మాత్రం తయారు చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఒకరిద్దరు బయటకు వచ్చి సినిమా తీసి నిరాశ పరిచారు. కానీ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వారు మాత్రం అద్భుతాలు సృష్టిస్తున్నారు.

సూర్య ప్రతాప్, బుచ్చి బాబు, శ్రీకాంత్ ఓదెల రీసెంట్ గా కార్తీక్ దండు ఇలా సుకుమార్ మాత్రమే కాదు తన అసిస్టెంట్స్ చేత కూడా హిట్ కొడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. బుచ్చి బాబు, సూర్య ప్రతాప్, కార్తీక్ లకు సినిమా టైం లో సుకుమార్ హెల్ప్ చేశాడు.

కానీ శ్రీకాంత్ ఓదెల మాత్రం తన సొంతంగా నానిని ఒప్పించి ఓన్ గానే సినిమా చేశాడు. సుకుమార్ అసిస్టెంట్ లు కూడా సూపర్ హిట్లు కొడుతున్నారు. అయితే ఇది కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కి హెడేక్ గా మారింది.

స్టార్ డైరెక్టర్ అంటే కేవలం తాము చేసిన సినిమాలను హిట్ చేయడమే కాదు తమ అసిస్టెంట్ లకు వర్క్ నేర్పించాల్సి ఉంటుందని చెప్పుకుంటున్నారు. లేటెస్ట్ గా ఉగ్రం ఈవెంట్ లో ఈ విషయం మీదే హరీష్ శంకర్ బయట పడ్డాడు.

సుకుమార్ ఒకరోజు తనని నీ అసిస్టెంట్ లు ఎవరు డైరెక్టర్స్ గా రావట్లేదా అని అడిగాడు. అప్పుడు సమాధానం చెప్పలేక వెలితిగా అనిపించింది. కానీ నాందితో తన అసిస్టెంట్ విజయ్ హిట్ కొట్టగానే సంతోషంగా అనిపించిందని అన్నారు.

అంతేకాదు హరీష్ మాటల సందర్భంలో తను హిట్ కొట్టడం కన్నా తన అసిస్టెంట్ డైరెక్టర్ హిట్ కొడితే డబుల్ కిక్ వస్తుందని అన్నాడు. సో సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ హిట్లు కొడుతున్నారని ఇండస్ట్రీలో ఏ రేంజ్ డిస్కషన్స్ చేస్తుంది అన్నది హరీష్ శంకర్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తుండగా నెక్స్ట్ తన అసిస్టెంట్ ఎవరు డైరెక్టర్ గా మారుతారో చూడాలి.

Similar News