గత కొంతకాలంగా చందమామ కాజల్ ప్రేమాయణంపై రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ యువహీరోతో కాజల్ ప్రేమలో ఉందంటూ ఒకటే ఊదరగొట్టుడు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే రంగుల ప్రపంచంలో ఇవన్నీ మామూలే అని అనుకుంటే, అప్పట్లో కాజల్ సదరు హీరోతో క్లోజ్ గా ఉన్నప్పటి ఫోటోల్ని స్వయంగా రివీల్ చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో యువహీరోతో ప్రేమ అంటూ గుసగుసలు వినిపించాయి.
ఆ యువహీరోతో సినిమా రిలీజైంది వెళ్లింది. డిజాస్టర్ రిజల్ట్ ఎదురైంది.. కాబట్టి మళ్లీ ఆ ప్రేమాయణం గురించి జనం మర్చిపోయారు. ప్రస్తుతం కాజల్ వేరొక ప్రేమలో ఉంది. ఈ బ్యూటీ నిరంతర ప్రయాణాలతో ప్రేమలో పడింది. ఆ క్రమంలోనే విమానాశ్రయంలో తాను ఎదుర్కొన్న ఓ ఇబ్బంది గురించి చెప్పింది కాజల్. ముంబై విమానాశ్రయానికి వచ్చాక 75 నిమిషాలు వృధా అయితే, జెట్ ఎయిర్వేస్ విమానాన్ని 30 నిమిషాల ప్రయాణ దూరంలో నిలిపేసి వారి సౌకర్యం కోసం గేట్లు కూడా మూసేశారు.. అంటూ సీరియస్ అయ్యింది కాజల్. తన విలువైన టైమ్ అంతా తినేసి అప్పుడు స్టాఫ్ పలకరించారట. తెల్లవారు ఝాము 4ఏఎం జర్నీ గొప్పగా సాగింది! అంటూ అసహనం వెల్లగక్కింది.
మరోవైపు కాజల్ ఇటీవల ఓ ఫోటోషూట్ పైనా ప్రేమలో పడింది. అదే ప్రఖ్యాత వెడ్డింగ్ వోస్ ఫోటోషూట్. ప్రస్తుతం ఈ ట్రెడిషనల్ లుక్ ఫోటోషూట్ కి సంబంధించి కవర్పేజీని కాజల్ ఇన్స్టాలో షేర్ చేసింది. కాజల్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ట్రెడిషనల్ లెహెంగా డ్రెస్ జువెలరీ కాంబినేషన్ ఆకట్టుకున్నాయి. 2019 డబ్ల్యూవీ బ్రైడ్ అంటూ కాజల్ ని సదరు మ్యాగజైన్ ఇంట్రడ్యూస్ చేసింది.
Full View