కొన్నిసార్లు అలా కలిసి వస్తుంది అంతే. అదృష్టలక్ష్మి తలుపు తట్టడం ప్రతిసారి జరగదు. అందుకే నిర్మాత అశోక్ వల్లభనేని ఈ అవకాశం వాడుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పోటీ తెలుగు సినిమాల మధ్య విపరీతంగా ఉన్నా రజనీకాంత్ మార్కెట్ మీదున్న నమ్మకంతో ధైర్యంగా పెట్టను జనవరి 10నే విడుదల చేసేందుకు రంగం సిద్ధమైయింది. రెండు మూడు రోజుల క్రితం వరకు వస్తుందా రాదా అనే అనుమానాలకు చెక్ పడిపోయింది. అయితే రజనికి ఎప్పటిలాగా భారీ విడుదల దక్కకపోవచ్చు. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పెట్ట తెలుగు డబ్బింగ్ వెర్షన్ హక్కులు చాలా రీజనబుల్ ప్రైజ్ కి ఇచ్చారట. థియేట్రికల్ హక్కులు కేవలం 12 కోట్లకే డీల్ కుదిరిందని సమాచారం. గతంలో పెట్ట నిర్మాత సన్ సంస్థ ఒక్క తెలుగు నుంచే 20 నుంచి 25 కోట్ల దాకా ఆశిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. వినయ విధేయ రామ-ఎన్టీఆర్-ఎఫ్ 2 ల మధ్య పోటీలో పెట్ట నడక అంత సులభంగా ఉండదు. సూపర్ బ్లాక్ బస్టర్ అనే టాక్ రావాలి. లేదా పైన చెప్పినవి దీని కన్నా వీక్ అనే మాట వినపడాలి. కానీ చూస్తున్న హైప్ వినిపిస్తున్న ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే మూడు దేనికవే సాటి అనేలా ఉన్నాయి. సో పెట్ట కాస్త గట్టిగానే కష్టపడాలి. ఒకవేళ హక్కుల వార్త నిజమే అయితే కనక ఇది చాలా సేఫ్ అని చెప్పొచ్చు. మాస్ మసాలాలు బాగాదట్టించారు కాబట్టి ఫైనల్ రన్ లో 12 కోట్లు ఈజీగా రాబట్టుకోవచ్చు. యావరేజ్ అన్నా వచ్చేస్తాయి. అంతకన్నా తక్కువ అంటేనే రిస్క్. మొత్తానికి పెట్ట భలే మంచి చౌక బేరము స్కీంలో వస్తోంది. పేరుకు తగ్గట్టు బంగారు కోడి పెట్ట అవుతుందో లేదో ఇంకో రెండు వారాల్లో తేలిపోతుంది. త్రిష సిమ్రన్ తలైవాకు జోడిగా నటించిన ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ విలన్ నవాజుద్దీన్ సిద్దిక్ సౌత్ కు పరిచయమవుతున్నాడు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ పేరు కంటే స్టార్ కాస్ట్ బ్రాండింగ్ మీదే తెలుగు వెర్షన్ మార్కెటింగ్ చేసుకుంటున్న పెట్ట కోసం జనవరి 10 దాకా ఆగాల్సిందే.