వర్మను పర్మిషన్ అడగాలని చెప్పినట్టా ?

Update: 2019-01-06 06:09 GMT
ఇంకో నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ కథానాయకుడు తెరపైకి వచ్చేస్తాడు. సరైన సినిమాతో సంక్రాంతి సందడి ఓపెన్ కాబోతోందని అభిమానులు ఇప్పటి నుంచే ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంత వరకు చూపించి ఉంటారు అనే దాని మీద అనుమానాలు తొలగనప్పటికీ ప్రమోషన్ లో ఉన్న బాలయ్య దీని గురించి రకరకాలుగా స్పందించడం  కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇందులో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు బాలయ్య స్పందిస్తూ ఎవరు ఎలాంటి సినిమా అయినా తీయొచ్చని చెప్పాడు.

అందులో అభ్యంతరపెట్టడానికి ఏమి లేదని చెబుతూనే బయోపిక్స్  తీస్తున్నప్పుడు సదరు వ్యక్తి జీవితానికి సంబంధించిన వ్యక్తులతో అనుమతి తీసుకోవాలని తాము అవన్నీ చేసే షూటింగ్ చేసామని చెప్పాడు. అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయడానికి ముందు తమ దగ్గరికి వర్మ రాలేదు వారసులుగా తమ పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పినట్టేగా. అయితే దీనికి వర్మ నుంచి ధీటైన కౌంటర్ రాకపోదు. ఎందుకంటే అనుమతుల విషయానికి వస్తే ఆ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కీలకమైన లక్ష్మి పార్వతి అండదండలు ఎలాగూ వర్మ తీసేసుకున్నాడు.

ఓపెనింగ్ ఆవిడతోనే చేయించాడు కాబట్టి ఆ సమస్య లేదు. పైగా వర్మ తీస్తోంది ఎన్టీఆర్ బయోపిక్ కాదు.  కేవలం ఆయన చివరి అంకంలోని రెండో వివాహం వెన్నుపోటు ఎపిసోడ్ తప్ప ఇంక దేన్నీ టచ్ చేయడం లేదు. రెండో పెళ్లి ఇష్యూ క్లియర్ కాబట్టి చిక్కు లేదు. వెన్నుపోటు సీన్స్ కి ఎవరి అనుమతి తీసుకోవాలి. అలా చేయాలి అంటే  అవతలి వాళ్ళు మేము వెన్నుపోటు చేసామని ఒప్పుకోవాలి.  సో బాలయ్య అడగటం వరకు ఓకే కాని వర్మ ఇలాంటి వాటికి బెదిరే టైపు కాదుగా.





Full View
Tags:    

Similar News