టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా తెరకెక్కిన ''డీజే టిల్లు'' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. 'అట్లుందటి మనతోని' అంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా రేంజ్ లో సంచలనం సృష్టించింది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఓటీటీలోనూ సత్తా చాటింది. దీంతో మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేశారు.
'డీజే టిల్లు' చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అందించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత ప్రొడక్షన్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ని కూడా ఇందులో భాగం చేశారు.
ఇప్పుడు 'డీజే టిల్లు 2' సినిమాని కూడా అదే బ్యానర్లలో నిర్మించడానికి రెడీ అయ్యారు. సీక్వెల్ కోసం దర్శకుడు విమల్ కృష్ణతో మరోసారి చేతులు కలిపాడు సిద్ధు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసారని అనుకుంటుండగా.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ గాసిప్ బయటకు వచ్చింది.
'డీజే టిల్లు' డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. విమల్ మరియు హీరో సిద్ధు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని అంటున్నారు. సిద్ధు ప్రవర్తనతో హర్ట్ అయిన విమల్ ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి'డీజే టిల్లు' చిత్రానికి చాలా వరకు సిద్ధునే దర్శకత్వం వహించినట్లు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు సీక్వెల్ విషయంలో సిద్ధు స్క్రిప్ట్ వర్క్ తో పాటు అన్నీ తానై చూసుకుంటున్నాడట.. ఈ క్రమంలోనే విమల్ కృష్ణ బయటకు వచ్చాడని చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు విమల్ స్థానంలోకి మరో కొత్త దర్శకుడు వచ్చి చేరాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా అన్ని విషయాలు వెల్లడించే వరకూ ఆగాల్సిందే.
ఇకపోతే సిద్ధు - నేహా శెట్టిలతో పాటుగా ప్రిన్స్ - బ్రహ్మజీ తదితరులు ఈ సీక్వెల్ లో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. 'డీజే టిల్లు' కి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ఎస్ థమన్ ఈ ప్రాజెక్ట్ లోనూ భాగం అయ్యే అవకాశం ఉంది.