రంగస్థలం చిట్టిబాబు ప్రభావం భామ్మర్ధి వైష్ణవ్ (మెగా మేనల్లుడు) పైనా పడిందా? అంటే అవుననే తెలుస్తోంది. నిన్నటిరోజున మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ ప్రీలుక్ రిలీజైనప్పుడే అందరిలో ఏదో సందేహం. వైష్ణవ్ హీరోగా గోదారి కథతోనే సినిమా తీస్తున్నారా? మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తీస్తున్నట్టున్నారా? చిట్టి బాబు ప్రభావం ఏమైనా ఉందా? అంటూ సందేహాలు కలిగాయి.
అవును .. ఈ సందేహమే నిజమే అయ్యింది. వైష్ణవ్ తేజ్ చిత్రం గోదారి బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. మేనల్లుడి భాష గోదారి యాసతోనే ఉంటుందట. అసలే చిట్టిబాబును తీర్చిదిద్దిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు గోదారి వాసి.. పైగా కాకినాడ కుర్రాడు కాబట్టి చిట్టిబాబుకు భామ్మర్ధి కథనే ఎంచుకున్నాడన్న అంచనా ఏర్పడింది. అవునా.. ఇది నిజమేనా? అని నిర్మాతల్ని(రవి, నవీన్) ప్రశ్నిస్తే.. వాళ్ల మొహాల్లో పెట్రోమాక్స్ కాంతితో కూడుకున్న చిరునవ్వే అందుకు సాక్ష్యంగా నిలిచింది. మళ్లీ అంత మంచి కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండస్ట్రీ బెస్ట్ సినిమాని అందించబోతున్నామన్న ధీమాని నిర్మాతలు వ్యక్తం చేశారు.
బుచ్చిబాబు ఎంచుకున్న కథ ఎంతో గొప్పది అని మెగాస్టార్ సైతం కితాబిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రీలుక్ లో బెస్తవాడి లుక్ తో వైష్ణవ్ తేజ్ తొలి ఇంప్రెషన్ కొట్టేశాడు. రంగస్థలం చిట్టిబాబులానే కనిపించాడంటే అతిశయోక్తి కాదు. సాయిధరమ్ తరహాలోనే రఫ్ గా.. రగ్గ్ డా కనిపించే వైష్ణవ్ తేజ్ కోసం రగ్గ్‌డ్ గా ఉండే కథనే ఎంపిక చేశామంటూ మెగాస్టార్ సైతం చెప్పారు. నేటి ఉదయం నానక్ రామ్ గుడలో సినిమా మొదలైంది. ఇక్కడ మేనల్లుడికి మెగాస్టార్ బ్లెస్సింగ్స్ అందాయి. మెగాస్టార్ క్లాప్ తో నానక్ రామ్ గుడలో వైష్ణవ్ సినిమా ప్రారంభమైంది. సుకుమార్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నిహారిక, వరుణ్ తేజ్, మైత్రి మూవీస్ నిర్మాతలు, 14 రీల్స్ నిర్మాతలు, సంతోష్ శ్రీనివాస్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
Full View