వరుణ్ తేజ్ హీరో గా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `అంతరిక్షం` ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజవుతుందని ప్రకటించారు. అయితే అప్పటికి ఈ సినిమా వస్తుందా? అంటే కష్టమేనన్న మాటా పరిశ్రమ ఇన్ సైడ్ సాగుతోంది. ఈ సినిమాకి 2.ఓ తరహాలో భారీ గ్రాఫిక్స్, వీ ఎఫ్ ఎక్స్ వర్క్ అవసరమైంది. ఈ పనులు తేలడం అంత వీజీగా కనిపించడం లేదట. గ్రాఫిక్స్ లో క్వాలిటీ వర్క్ లేక పోతే ఇలాంటి సినిమాలు జనాలకు ఎక్కడం అంత సులువేం కాదు. 2.ఓ అంతకంతకు ఆలస్యం అవ్వడం వెనక కారణం కూడా అదే. ఆ సినిమాకి ఓసారి గ్రాఫిక్స్ చేసి, అది నచ్చక మరోసారి చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు సేమ్ టు సేమ్ సీన్ `అంతరిక్షం 9000 కెఎంపిహెచ్` విషయంలో రిపీట్ కాకుండా దర్శకనిర్మాతలు ఎంతో జాగ్రత్తపడుతున్నారట. ఆ మేరకు చిత్రయూనిట్ కి సంబంధించిన క్లోజ్ సోర్స్ వివరాలు అందించింది. అంతరిక్షం చిత్రంలో కొన్ని సీన్లు పీక్స్‌లో ఉంటాయి. వాటికి వీ ఎఫ్ ఎక్స్ పనితనం చాలా అవసరం. వరుణ్ తేజ్ ఉద్యోగం కోల్పోయిన స్పేస్ సైంటిస్ట్. అత్యవసరంగా అంతరిక్షం నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి భారత్‌ని కాపాడేందుకు అతడు చేపట్టబోతున్న ఆపరేషన్ ఏంటి? అన్నదే కథాంశం. ఇందులో కొన్ని సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయట. అంతరిక్షంలో రెక్కలు తెగిన పక్షిలా స్పేస్ షిప్ నుంచి వరుణ్ తేజ్ దూరమైపోతాడు. ఆ సీన్‌లో ఎమోషన్ పండించేందుకు సంకల్ప్ అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకున్నారట. దానిని ఎగ్జాక్ట్‌గా అనుకున్నట్టే చిత్రీకరించి, వీఎఫ్ఎక్స్‌లో బాగా వచ్చేందుకు పని చేస్తున్నారట.
అలాగే ఈ సినిమా కథ ఆద్యంతం అంతరిక్షంలో సాగుతున్నా.. భూమ్మీద వరుణ్‌తేజ్‌కి కథానాయికలతో లవ్ కూడా ఉంటుంది. అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి లాంటి అందగత్తెలతో రొమాన్స్ మైమరిపిస్తుందట. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్‌లో కీలకమైన పనులు సాగుతున్నాయి. ఘాజి తో జాతీయ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద రేంజులో ప్లాన్ చేశారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ విజువల్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికైతే డిసెంబర్ 21న వస్తుందా.. రాదా? అన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదని తెలుస్తోంది. భారతదేశ సినీచరిత్రలో ఓ గొప్ప సినిమాని తెరకెక్కిస్తున్నామన్న నమ్మకం అంతరిక్షం టీమ్‌లో ఉందని మాత్రం చెబుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది.. తెలుగులో పూర్తి స్థాయి అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే కాబట్టి ఆ క్యూరియాసిటీ జనాల్లో పెరుగుతోంది.