అబ్బే అంత లేదంటూనే ఇంత తీసుకుంటున్నాడా?

Update: 2019-01-26 11:19 GMT
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ హీరో. యూత్‌ ఆడియన్స్‌ విజయ్‌ దేవరకొండ సినిమాలంటే పిచెక్కి పోతున్నారు. ఒకప్పుడు మహేష్‌ బాబు అంటే అమ్మాయిలు పడి చచ్చేవారు. ఇప్పుడు అమ్మాయిలకు కలల రాకుమారుడు విజయ్‌ దేవరకొండ అయ్యాడు. గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. విజయ్‌ దేవరకొండ అంతకు ముందు వరకు కోటికి అటు ఇటుగానే పారితోషికం తీసుకునేవాడు. కాని అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందం చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ భారీగా పారితోషికం పెంచేశాడు.

ఆమద్య విజయ్‌ దేవరకొండ పారితోషికం గురించి మాట్లాడుతూ తన పారితోషికం మీడియాలో ప్రచారం జరుగుతున్నంత ఏమీ ఉండదని, తన స్థాయిని బట్టే పారితోషికం తీసుకుంటానని, నిర్మాతలను ఇబ్బంది పెట్టనంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాని తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం పారితోషికం విషయంలో నిర్మొహమాటంగా విజయ్‌ దేవరకొండ ఉంటున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా దిల్‌ రాజు ఒక సినిమా కోసం విజయ్‌ దేవరకొండను సంప్రదించగా, కథ విషయం పక్కన పెడితే 10 కోట్ల రూపాయలను డిమాండ్‌ చేశాడట. ఇంకా ఆ సినిమా చర్చల దశలోనే ఉంది.

కేవలం దిల్‌ రాజు సినిమాకు మాత్రమే కాకుండా ప్రస్తుతం నటిస్తున్న డియర్‌ కామ్రేడ్‌ చిత్రానికి, ఆ తర్వాత చేయబోతున్న క్రాంతి మాధవ్‌ చిత్రానికి కూడా భారీగా పారితోషికం తీసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు దేవరకొండ గతంలోనే ఒప్పుకున్నప్పటికి ఈయన క్రేజ్‌ బాగా పెరిగిన నేపథ్యంలో భారీగా పారితోషికంను ఇస్తున్నారు. ఇక మైత్రి మూవీస్‌ వారి బ్యానర్‌ లో విజయ్‌ దేవరకొండ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఆ సినిమాకు దేవకొండకు మైత్రి వారు 10 కోట్లు ముట్టజెప్పుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News