తమిళ ఇండస్ట్రీలో విశాల్ హీరో. అందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇండస్ట్రీకే కాదు.. అభిమానులకు, దర్శకులకు అందరికి హీరోనే. కానీ విశాల్ ఇప్పుడు కొంతమంది నిర్మాతలకు, నటులకు విలన్‌గా మారాడు. దీంతో.. వాళ్లంతా ఇప్పుడు విశాల్ పై కత్తి గట్టి.. మనోడ్ని అరవ ఇండస్ట్రీ నుంచి తన్ని తరిమేయాలని చూస్తున్నారు.
నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత విశాల్ చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. చాలా వరకు అవినీతి లేకుండా అంతా పారదర్శకంగా ఉండేలా చూశాడు. విశాల్ తెలుగువాడు. ఓ తెలుగువాడు.. తమ పై పెత్తనం చేయడం, అన్నింటికి మించి సినిమాల పరంగా, రాజకీయంగా విశాల్ ఒక శక్తిగా ఎదగడం అక్కడున్న కొంతమందికి నచ్చలేదు. దీంతో.. చిన్న నిర్మాతల్ని పావుగా వాడుకుని.. విశాల్ పైకి ఎగదోశారు.
వాళ్లు కాస్తా.. రోడెక్కడం, నడిగర్ సంఘానికి తాళం వెయ్యడం, ఆ తాళం తీసేందుకు ప్రయత్నించిన విశాల్ ను పోలీసులు అరెస్ట్ చేయడం అంతా ఒక సీరియల్ డ్రామాలా జరిగిపోయింది. అయితే.. ఇంత డ్రామా వెనుకు.. విశాల్ ను ఎలాగైనా సరే.. తమిళ ప్రజల దృష్టిలో విలన్ గా మార్చాలనేది కొందరు పెద్దల పెద్ద ఆలోచన. కానీ విశాల్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా… తమ పార్టీ, సినిమాలు, సమాజ సేవతో అక్కడి ప్రజల గుండెల్లో హీరోగా మారాడు.