మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఆటోజానీ` తెరకెక్కాల్సి ఉండగా..ఆ స్క్రిప్ట్ చర్చల దశలోనే వర్కవుట్ కాని సంగతి తెలిసిందే. ప్రథమార్థం కథతో ఫిదా అయినా చిరంజీవి ద్వితీయార్ధానికి వచ్చేసరికి అప్సెట్ అయ్యారని కథనాలొచ్చాయి. దానివల్ల ఆ కాంబినేషన్ కి బ్రేక్ పడినట్లు మీడియా కథనాలు వేడెక్కించాయి. ఆ విషయాన్ని మెగా కాంపౌండ్ ముందుగా పూరికి చెప్పకుండా మీడియాకి చెప్పేయడం తో పూరి హర్ట్ అయ్యారు . అప్పటి నుంచి మెగా కాంపౌండ్ కి పూరి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఏదో ఒకరోజు బాస్ తో కచ్చితంగా సినిమా చేస్తాననని...150 కాకపోతే 155 అవుతుంది... ఏదో ఒక నంబర్ తనకి దక్కుతుందని పూరి కాన్ఫిడెంట్ గా చెప్పారు.
చిరు మెచ్చే వరకూ స్క్రిప్టులు రాస్తూనే ఉంటానని అన్నారు. అయితే తాజాగా పూరి సడెన్ గా నిన్న చిరంజీవి 154వ సినిమా ఓపెనింగ్ రోజు పూజా కార్యక్రమాల్లో కనిపించారు. ఆయన ప్రత్యేక గెస్ట్ గా హాజరై ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేసారు. అక్కడికి పూరితో పాటు చాలా మంది దర్శకులు వచ్చారు. కానీ పూరి మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గానే హైలైట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆటోజానీని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. పూరిని మెగా కాంపౌండ్ ఆహ్వానించడం..ఆయన రావడం కెమెరా స్విచ్చాన్ చేయడం వంటి సన్నివేశాలు ఆటోజానీకి ఆశలుగా కనిపిస్తున్నాయని మీడియాలో ప్రచారం సాగుతోంది.
చిరంజీవి ఆటోజానీకి బ్రేకులు వేసింది కేవలం సెకెండాఫ్ విషయంలో. మిగతా కథ అంతా ఒకే అయింది. ఇప్పుడు సెకెండాఫ్ ని కూడా చిరు మెచ్చేలా పూరి సిద్ధం చేసి లాక్ చేసారా? అన్న సందేహం రాక మానదు. ఇటీవలే పూరి తనయుడు ఆకాష్ కూడా తండ్రి గురించి ఓ రేంజ్ లో ఆకాశానికి ఎత్తేసారు. సరిగ్గా రొమాంటిక్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అయితే ఆకాష్ ఆరోజు మాట్లాడిన మాటలు వెనుక పరమార్థం ఇదేనా? ఆటోజానీయేనా? అంటూ కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మెగాస్టార్ తో సినిమా అంటే దర్శకుడిగా పరిపూర్ణం అయినట్లే... బాస్ తో కన్ఫామ్ గా పూరి హిట్ కొట్టినట్లే లెక్క. మరోసారి పూరీతో సర్ ప్రైజ్ కాంబినేషన్ సెట్ అవుతుందనే చిరు అభిమానులు ఊహిస్తున్నారు.