మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి సెట్స్ మీదకి వచ్చిన ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు అందరూ నమ్మకంగా ఉన్నారు. అయితే దీని తర్వాత మెగాస్టార్ ఓకే చేసిన ప్రాజెక్ట్స్ పై మాత్రం మెగా ఫ్యాన్స్ కాస్త డౌట్ గా ఉన్నారు. ఎందుకంటే చిరు తదుపరి సినిమాలు డైరెక్ట్ చేస్తున్న దర్శకులు ముగ్గురూ అవుట్ డేటెడ్ లేదా ఫ్లాప్ డైరెక్టర్స్. చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ హిట్ సినిమా 'వేదలమ్' రీమేక్ లో నటించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నారని సమాచారం.
అలానే మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే 'ఆచార్య' తర్వాత మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే డైరెక్టర్స్ ముగ్గురూ అవుట్ డేటెడ్ లేదా ప్లాపులో ఉన్న వారే కావడం గమనార్హం. అందుకే మెగా అభిమానులు 'ఆచార్య' సినిమా తర్వాత చిరు లైనప్ చూసి కలవరపడుతున్నారని టాక్ నడుస్తోంది.