క‌త్రిన బ‌లానికి మూల స్థంబాలు ఎవ‌రంటే?

Update: 2021-12-13 11:30 GMT
కత్రినా కైఫ్- విక్కీ కౌశ‌ల్ జంట వివాహం ప్ర‌స్తుతం ట్రెండింగ్ గా మారింది. కొత్త జంట త‌మ‌ పెళ్లి నుంచి వ‌రుస‌గా ఫోటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటే అవ‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా ఈ గ్రాండ్ గాలా వెడ్డింగ్ నుంచి కొన్ని అద్భుతమైన ఫోటోలు క‌త్రిన షేర్ చేసింది. ఈ పోస్ట్ ను కత్రినా కైఫ్ సోదరీమణులకు అంకితం చేసింది. ``బలానికి మూలస్తంభాలు`` అంటూ త‌న సోద‌రీమ‌ణుల‌ను క‌త్రిన‌ అభివర్ణించింది.

ఈ ఫోటోగ్రాఫ్ లో కత్రీన ఆరుగురు అక్క‌చెల్లెమ్మ‌లు త‌న‌తో న‌డిచి వ‌చ్చారు. న‌వ‌వ‌ధువు పెళ్లి దుస్తులలో శింగారంగా న‌డుచుకుంటూ వెళుతుంటే త‌న‌కు ప‌ల్ల‌కిని మోస్తూ.. సోదరీమణులు స్టెఫానీ- క్రిస్టీన్- నటాచా- మెలిస్సా- సోనియా - ఇసబెల్లె పూల నడవలో నడుస్తూ కనిపించారు. పెళ్లికూతురు సోద‌రీమ‌ణులు వివాహానికి గులాబీ రంగు దుస్తుల్ని అడాప్ట్ చేసుకోవ‌డం విశేషం.

భావోద్వేగంతో కత్రినా కైఫ్ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. ``ఎదిగేప్పుడు సోదరీమణులు అంతా ఎల్లప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటాము. వారు నా బలానికి మూలస్తంభాలు. మేము ఒకరినొకరు నిలబెట్టుకుంటాము... ఇది ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి`` అని క‌త్రిన పోస్ట్ చేసింది. ఇక ఇస‌బెల్లే క‌త్రిన వోన్ సిస్ట‌ర్ కాగా.. ఇత‌రులు క‌జిన్స్ అని తాజా పోస్ట్ ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. వీరంతా అమెరికా నుంచి ఈ పెళ్లికి విచ్చేశారు.

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ వివాహం ఒక‌ ప్రైవేట్ వ్యవహారం. వారి పెళ్లికి నో ఫోన్ పాలసీ అమ‌లైంది. డిసెంబరు 9న సవాయి మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అనే రాజభవనంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకల నుండి వ‌రుసగా ఫోటోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వైర‌ల్ గా మారుతున్నాయి.

కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లో వివాహం చేసుకున్నారు. ఈ స్టార్ క‌పుల్ 2019లో డేటింగ్ ప్రారంభించారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో జూమ్ చాట్ షో ద్వారా ఆహ్వానం అందుకున్న హీరో హర్ష్ వర్ధన్ కపూర్ నటీనటులు డేటింగ్ చేస్తున్నారని ధృవీకరించారు.
Tags:    

Similar News