నెం. 1 హీరో అయనే.. తేల్చేసిన పీఆర్వో!

Update: 2019-01-04 06:54 GMT
కొన్ని టాపిక్ లు ఎడతెగకుండా ఉంటాయి. ఎంత మీరు వాదించినా దానికి లాజికల్ కంక్లూజన్ దొరకదు.  ఓ పదేళ్ళ క్రితం ఏదైనా చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 హీరో అనే ట్యాగ్ కు అర్థం ఉండేది. కానీ మీరిప్పుడు ఏ ఇండస్ట్రీ అయనా తీసుకోండి.. నెంబర్ హీరో ఎవరో కరెక్ట్ గా చెప్పడం కష్టమై పోయింది.   హిందీలో షారూఖ్ ను బాద్షా.. నెంబర్ వన్ అనే వారు. కానీ అయన హిట్ మొహం చూసి ఇదేళ్ళయింది. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్లు బాక్స్ ఆఫీస్ ను గడగడ లాడిస్తున్నారు కానీ ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అంటే ఎవ్వరూ చెప్పలేరు.

తెలుగులో గతంలో చిరంజీవి నెంబర్ 1.  ఇప్పుడు ఎవరు నెంబర్ 1 అంటే చెప్పలేని పరిస్థితి ఉంది.  రీ-ఎంట్రీ తర్వాత చిరు చేసింది ఒక్క సినిమానే కాబట్టి ఏకపక్షంగా చిరుకు కీరటం ఇవ్వడం కష్టం. అలా ఇస్తే ప్రభాస్.. మహేష్ బాబు.. రామ్ చరణ్ ల రికార్డులను గుర్తించనట్టే. తమిళంలో కూడా సేమ్ పరిస్థితి.  రజనీకాంత్ నెంబర్ 1 అంటారు గానీ రజనీ సినిమాల కంటే విజయ్.. అజిత్ ల సినిమాల కలెక్షన్స్ భారీగా ఉంటున్నాయి.  సరిగ్గా ఇదే విషయంపై విజయ్ దగ్గర పీఆర్వో గా గతంలో పనిచేసిన వ్యక్తి ఈ నెంబర్ వన్ ప్లేస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

రజనీ ఇపుడు నెంబర్ 1 కాదని..  విజయ్ అయన స్థానాన్ని ఎప్పుడో భర్తీ చేశాడని అంటున్నాడు. ఆయన వాదనకు సపోర్ట్ గా 'మెర్సల్'.. 'సర్కార్' సినిమాల కలెక్షన్స్ చూపిస్తున్నాడు.  రజనీకి ఇప్పటికీ గొప్ప ఇమేజ్ ఉందని.. కాకపోతే  విజయ్.. అజిత్ లు మొదటి స్థానం కోసం గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉండడంతో రజనీ రెండో స్థానానికి దిగిపోయాడని అన్నాడు.  ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే థియేటర్ల నుండి కలెక్షన్స్ రిపోర్ట్స్ ను చూపించి మరీ నిరూపిస్తానని అంటున్నాడు. 

అసలే కోలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ తారాస్థాయిలో ఉంటాయి. ఏ చిన్న విషయం దొరికినా దానిపై పెద్ద హంగామా చేస్తారు. దీంతో విజయ్ ఫ్యాన్ క్లబ్ వారు విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదని.. అసలు విజయ్ ఎప్పుడు ఇలాంటి కంపారిజన్స్ కు మద్దతివ్వడని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.  వారు వివాదం పెద్దది కాకుండా ఈ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకున్నప్పటికీ కొలీవుడ్ లో మాత్రం నెంబర్ 1 హీరో ఎవరు అనేదానిపై డిబేట్ మాత్రం మొదలైపోయింది.
    






Full View
Tags:    

Similar News