హారిస్ జయరాజ్.. ఈ పేరుని తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఆయనొకరు. తెలుగు తమిళ భాషల్లో కొన్నేళ్లపాటు తన సంగీతంతో శ్రోతలని ఉర్రుతలూగించాడు. వెస్ట్రన్ మ్యూజిక్ కి నేటివ్ టచ్ ఇస్తూ ఆయన కంపోజ్ చేసిన పాటలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా అతను స్వరపరిచిన మెలోడీ గీతాలను లూప్ మోడ్ లో ప్లే చేసుకొని మ్యూజిక్ లవర్స్ ఇప్పటికీ ఉన్నారు. 'చెలి' వంటి డబ్బింగ్ సినిమాతో తొలిసారిగా తెలుగు సంగీత ప్రియులకు తన పాటలను పరిచయం చేసిన హారిస్ జయరాజ్.. ఆ తర్వాత 'వాసు' అనే స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి ఫస్ట్ టైం మ్యూజిక్ అందించారు.
ఆయన వర్క్ చేసిన ప్రతీ తమిళ్ సినిమా కూడా డబ్బింగ్ చేయబడటంతో.. ఇక్కడ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. హారిస్ తెలుగులో 'వాసు' తర్వాత 'ఘర్షణ' 'సైనికుడు' 'మున్నా' 'సెల్యూట్' 'ఆరెంజ్' 'స్పైడర్' వంటి చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించారు.
అలానే 'అపరిచితుడు' 'గజినీ' 'రాఘవన్' 'నువ్వేలే నువ్వేలే' 'భీమ' 'రక్షకుడు' 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' 'వీడోక్కడే' 'ఘటికుడు' 'రంగం' 'సెవెంత్ సెన్స్' 'స్నేహితుడు' 'బ్రదర్స్' 'తుపాకీ' వంటి డబ్బింగ్ సినిమాల సాంగ్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. కానీ 'స్పైడర్' తర్వాత హారిస్ జయరాజ్ మళ్ళీ తెలుగు సినిమాలకు సంగీతం సమకూర్చలేదు.
అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత సంగీత దర్శకుడు ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు తెలుగు సినిమాలకు మ్యూజిక్ అందించడానికి రెడీ అయ్యాడు. యువ హీరో నితిన్ మరియు డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి హారిస్ సంగీతం సమకూరుస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో నాగశౌర్య సినిమాకి హారిస్ జయరాజ్ వర్క్ చేయనున్నట్లు ప్రకటించారు. అరుణాచలం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంచి. శ్రీనివాసరావు చింతలపూడి - విజయ్ కుమార్ చింతలపూడి - అశోక్ కుమార్ చింతలపూడి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.
NS24 అనే వర్కింగ్ టైటిల్ తో రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్ కి హారిస్ మ్యూజిక్ అందించనున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన సంగీత దర్శకుడి చేరికతో ఈ సినిమాకు మంచి హైప్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే.. తమిళ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన హరీస్ జయరాజ్.. తెలుగులో మాత్రం ఆశించిన విజయాలు అన్నదుకోలేదు. ఆయన తెలుగులో సంగీతం అందించిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవలేదు. పాటలు ఓ రేంజ్ లో సక్సెస్ అయినా.. సినిమా ఆడిన దాఖలాలు లేవు.
అందుకే హరీస్ జయరాజ్ తెలుగులో మ్యూజిక్ ఇస్తే ఆ సినిమా ప్లాప్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలపడింది. ఈ నేపథ్యంలో తెలుగులో సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సంగీత దర్శకుడు.. ఈసారి రెండు చిత్రాలతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.