సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల

Update: 2021-09-11 04:41 GMT
రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై  తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 'సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి.  ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం.. ఈరోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం' అని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  ఇక సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై రేపు మరో బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు.

సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. సాయిధరమ్ తేజ్ కు స్వల్ప గాయలయ్యాయని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి తెలిపారు. అభిమానులు ఎవరూ కంగారుపడొద్దని.. త్వరలోనే సాయిధరమ్ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడని తెలిపారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తోపాటు సందీప్ కిషన్ సైతం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను ఆరాతీశారు.

ఇక సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడని అల్లు అరవింద్ తెలిపారు. . 'సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. కొన్ని గంటల్లోనే మామూలు పరిస్థితికి వస్తాడు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు. డాక్టర్లతో నేను మాట్లాడారు. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసి మిగిలిన వివరాలు తెలియజేస్తారని' అల్లు అరవింద్ అన్నారు.

అపోలో ఆస్పత్రికి మెగా ఫ్యామిలీ మెంటర్స్ అంతా చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ ను మెడికవర్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. సాయితేజ్ కుటుంబ సభ్యులు చిరంజీవి, సురేఖ, నాగబాబు, పవన్ కళ్యాణ్,అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్ తదితరులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అపోలో ఎండీ సంగీత రెడ్డి కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. మరో 48 గంటల్లో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరింత క్లారిటీ ఇస్తామని వైద్యులు తెలిపినట్లు మెగా ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.
Tags:    

Similar News