స్టార్ క‌మెడియ‌న్ కు గుండెపోటు.. ప‌రిస్థితి విష‌మం!

Update: 2021-04-16 09:46 GMT
ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టుడు వివేక్ గుండెపోటుకు గుర‌య్యారు. శుక్ర‌వారం ఉన్న‌‌ట్టుండి కుప్ప‌కూలిపోవ‌డంతో ఆయ‌న‌ను చెన్నైలోని వ‌డ‌ప‌ళ‌ని సిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌రిశీలించిన వైద్యులు వెంటీ లేట‌ర్ పై చికిత్స అందిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతానికి ఆరోగ్య ప‌రిస్థితి కాస్త విష‌మంగానే ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. వివేక్ నిన్ననే క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. వ్యాక్సిన్ తీసుకున్న మరుసటిరోజే హార్ట్ ఎటాక్ కు గురికావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. వివేక్ కార్డియాక్ అరెస్టుకు.. వ్యాక్సిన్ కు ఏమైనా సంబంధం ఉందా? అనే విష‌యం తెలియ‌లేదు. ప్ర‌స్తుతానికి వైద్యులు  ఎక్మో ట్రీట్ మెంట్ అందిస్తూ.. వివేక్ ఆరోగ్యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నారు.

కాగా.. నిన్న క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ఆయ‌న సోష‌ల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. అంద‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, కొవిడ్ బారి నుంచి వ్యాక్సిన్ మ‌న‌ల్ని కాపాడుతుంద‌ని చెప్పారు. అంత‌లోనే ఇలా జ‌ర‌గ‌డంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. వివేక్ ఆరోగ్యంగా తిరిగి రావాల‌ని అభిమానులు పూజ‌లు చేస్తున్నారు.
Tags:    

Similar News