కామ్రేడ్ బరువంతా దాని మీదే?

Update: 2019-07-21 05:25 GMT
ఇంకో ఐదు రోజులు గడిస్తే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. గత ఏడాది చివర్లో టాక్సీ వాలాతో మెప్పించిన విజయ్ దేవరకొండ మళ్ళీ తెరమీద కనిపిస్తోంది ఇందులోనే. అందుకే అభిమానుల అంచనాలు కూడా భారిగా ఉన్నాయి . వారం ముందే అడ్వాన్సు బుకింగ్ పెట్టేయడంతో జోరు బాగానే కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఫైనల్ వెర్షన్ 2 గంటల 50 నిముషాలు లాక్ చేయడం గురించి చర్చ జరుగుతోంది. అంతసేపు ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న కథను చూస్తారా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా జరిగిపోతుందట. స్టూడెంట్ యూనియన్లు వాటి రాజకీయాలు వ్యవస్థకు తిరగబడే విద్యార్ధి నాయకుడిగా విజయ్ ప్రస్థానం ఆ తర్వాత రష్మికతో పరిచయం అటు పై ప్రేమ ఇలా ఒక ఫ్లోలో సాగుతుందట. కాలేజీ తాలూకు ఎపిసోడ్స్ గురించి ప్రీ పాజిటివ్ టాక్ అయితే చాలా ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా బరువైన ఎమోషన్స్ తో హెవీ సెంటిమెంట్ తో ఉంటుందని ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

అర్జున్ రెడ్డి అంత నిడివి ఉన్నా ప్రేక్షకులు ఆమోదించడానికి కారణం హీరో క్యారెక్టరైజేషన్ లో ఉన్న విపరీత ధోరణి యూత్ కి బాగా కనెక్ట్ అయిపోవడం. కానీ కామ్రేడ్ లో బాబీ పాత్ర అలా ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే దానికి వ్యతిరేక దిశలో సాగుతుంది. అలాంటప్పుడు అంత లెన్త్ ఉన్న పోస్ట్ ఇంటర్వెల్ ని ఒప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు డియర్ కామ్రేడ్ ఫలితంలో దీనిదే కీలక పాత్ర అంటున్నట్టుగా తెలిసింది. ఏదైతేనేం ఈ సస్పెన్సు ఈ శుక్రవారం దాకే కాబట్టి వేచి చూడాలి.


Tags:    

Similar News