ఎన్టీఆర్ సినిమాకు ఈ కష్టమేంటో?

Update: 2016-08-31 09:22 GMT
ఎన్టీఆర్ కెరీర్లోనే ఎన్నడూ లేనంత హైప్ వచ్చింది ‘జనతా గ్యారేజ్’ విషయంలో. ఆకాశాన్నంటే అంచనాల మధ్య.. ఫుల్ పాజిటివ్ బజ్ తో విడుదలవుతోంది ఈ సినిమా. గురువారమే విడుదలవుతుండటం వల్ల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉంది.. మరోవైపు సోమవారం వినాయక చవితి కావడం కూడా కలిసొచ్చే విషయమే. ఐతే ఇదంతా బాగానే ఉంది కానీ.. విడుదల సమయంలోనే పరిస్థితులు ఏమంత బాగా లేవు. తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వచ్చే 24 గంటల్లో రాష్ట్రమంతటా భారీ వర్షాలు తప్పవు. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి.

వర్షాలు ఇలాగే కంటిన్యూ అవుతాయంటున్నారు కాబట్టి రిలీజ్ రోజు ‘జనతా గ్యారేజ్’ మీద కచ్చితంగా ప్రభావం పడటం ఖాయం. అభిమానులు ఎన్ని ఇబ్బందులున్నా సినిమాలు చూస్తారు కానీ.. సామాన్య ప్రేక్షకులే థియేటర్లకు రావడం కష్టం. వర్షాలు ఇలాగే కొనసాగితే కచ్చితంగా ‘గ్యారేజ్’ వసూళ్లపై ప్రభావం ఉంటుంది. అన్నీ కలిసొస్తున్న వేళ ఓపెనింగ్స్ రికార్డులు బద్దలైపోతాయనుకుంటుంటే ఈ అనుకోని ఇబ్బందేంటా అని బాధపడుతున్నారు అభిమానులు. ఎన్టీఆర్ ప్రతి సినిమాకూ ఇలా అనుకోకుండా ఏదో ఒక తలనొప్పులేంటని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. బెనిఫిట్ షోల గొడవ తేలిపోయిందని.. రెండు రాష్ట్రాల్లోనూ ఏ ఆటంకాలు లేకుండా అర్ధరాత్రి నుంచే షోలు పడిపోతున్నాయని సంతోషపడితే.. వర్షాల బెడద వేధిస్తోంది. ఎన్టీఆర్ ప్రకృతి ప్రేమికుడి పాత్ర పోషిస్తున్న సినిమాకు ఇలా ప్రకృతే అడ్డం పడుతోందేంటో?
Tags:    

Similar News