హీరో బోర్ కొట్టేశాడు.. ఇక చేయను

Update: 2017-06-01 13:16 GMT
ఫలానా హీరోతో పని చేయడం బోర్ కొట్టేసింది.. ఇకపై ఆ హీరోతో పని చేయాలనుకోవట్లేదు.. అని ఏ హీరోయిన్ అయినా అంటుందా..? ఏదైనా ఓపెన్ గా మాట్లాడేసే హెబ్బా పటేల్.. రాజ్ తరుణ్ ప్రస్తావన వచ్చినపుడు ఇలాగే స్పందించింది. రాజ్ తరుణ్ తో ఇప్పటికే ఎక్కువ సినిమాలు చేసేశానని.. అతను బోర్ కొట్టేస్తున్నాడని.. అతడితో ఇప్పుడిప్పుడే మళ్లీ ఓ సినిమా చేయాలనుకోవట్లేదని హెబ్బా చెప్పింది. రాజ్ తరుణ్ తో తొలి సినిమా చేసినప్పటితో పోలిస్తే అతడిలో చాలా మార్పు వచ్చిందని.. అదే సమయంలో అతడితో మళ్లీ మళ్లీ నటించడం వల్ల బోర్ కొట్టేస్తున్నాడని చెప్పాడు. ఇంకా రాజ్ గురించి ఆమె ఏమందంటే..

‘‘రాజ్ తో తొలిసారి ‘కుమారి 21 ఎఫ్’ చేశాను. అప్పటితో పోలిస్తే అతను వ్యక్తిగతంగా రాజ్ తరుణ్‌ చాలా మారిపోయాడు. ఇప్పుడతను చాలా సౌమ్యుడిలా కనిపిస్తున్నాడు. చాలా కామ్ అయిపోయాడు. మొదట్లో అతను చాలా హైపర్. ఇప్పుడు అలా లేడు. యాక్టింగ్ పరంగా మార్పులేమీ లేవు. రాజ్ తరుణ్‌ తోనే కాకుండా ఇతర హీరోలతో కూడా నటించాలని అనుకొంటున్నాను. రాజ్ తరుణ్‌ తో వెంటనే మాత్రం ఇంకో సినిమా చేయను. ఇప్పటికే మూడు సినిమాలు చేయడం వల్ల రాజ్ బోర్ కొడుతున్నాడు. అందుకే కొంత గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకొన్నాను. రాజ్ తో మూడు సినిమాలు చేసేసరికి నాకు.. అతడికి ఎఫైర్ అంటూ చాలా రూమర్స్ వచ్చేశాయి. ఇంకో సినిమా చేస్తే పెళ్లి చేసేసుకున్నాం అంటారు. తర్వాత మరో సినిమా చేస్తే పిల్లలు కూడా కనేశాం అంటారేమో. ఇక 2015 నుంచి వరుసగా సినిమాలు చేస్తుండటంతో అలిసి పోయాను. రెండు నెలలు సినిమాల సంగతి పక్క పెట్టేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. ఇప్పట్లో పెళ్లి చేసుకోను. కెరీర్ ముగిసిందని.. అవకాశాలు రావడం లేదు అని అనిపించినప్పుడు పెళ్లి చేసుకొంటాను’’ అని హెబ్బా తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News