​అంధగాడుకి పెళ్లి చేసిన హెబ్బా పటేల్

Update: 2017-05-30 05:00 GMT
తెలుగు లో ఇప్పుడు చిన్న సినిమాల హిట్ పెయిర్ గా రాజ్ తరుణ్ - హెబ్బా పటేల్​ ​మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో వీళ్ళ జంట మంచి ఫేమస్ అయింది. ఆ ఫేమ్ వాడుకొనే పనిలో పడి ‘ఆడోరకం ఈడోరకం’లోనూ వీళ్ళు జోడీగా చేశారు. ఇప్పుడు మళ్ళీ ‘అంధగాడు’తో మరోసారి జంటగా రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో రాజ్ తరుణ్  హెబ్బా అల్లరితో ఊరిస్తున్నారనుకోండి.

ఒక  ఫేస్ బుక్ లైవ్ చాట్ లో మీ మధ్యన స్నేహ సంబంధం ఇప్పుడు ఎంత వరకు వచ్చింది ఎలా ఉంది అని  అడిగిన ప్రశ్నకు హెబ్బా పటేల్ టక్కున చెప్పింది ఇలా  ''అయనా రాజ్ తరుణ్ కి పెళ్లయిపోయింది కదా?” అనేసింది. ఊహించని ఈ సమాధానానికి రాజ్ తరుణ్ షాక్ అయ్యి  వెంటనే తేరుకొని “అదేలెండి న్యూస్ పేపర్ లో నా పెళ్ళిళ్ళు చాలాసార్లు చేశారుగా” అని కవర్ చేశాడు. అక్కడ ఉన్నవాళ్లకు కూడా ఇది ఎదురుచూడని సమాధానమే. రూమర్లపై రాజ్ తరుణ్‌ సెటైర్.. అలాగే రాజ్ తరుణ్‌ గురించి హెబ్బా సరసం.. అబ్బో పీక్స్ అంతే.

ఇదిలా ​ ఉండగా అంధగాడు ప్రీ రిలీస్ ఫంక్షన్ లో  విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “రాజ్ తరుణ్ అండ్ హెబ్బా పటేల్ జంట తెలుగులో కృష్ణ-విజయ నిర్మలా హిందీలో ధర్మేంద్ర-హేమ మాలిని లాంటిది అని వీళ్ళద్దరు కలిసి చాలా సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నా'' అని చెప్పారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News