ఫోటో స్టోరి: కుమారి 32ఎఫ్ రీలోడెడ్

Update: 2021-06-08 22:30 GMT
కుమారి 21 ఎఫ్ లో ముంబై బ్యూటీ హెబ్బా ప‌టేల్ న‌ట‌న యూత్ కి ఎంత‌గా క‌నెక్ట‌య్యిందో తెలిసిందే. గొప్ప అంద‌గ‌త్తె అనేకంటే గొప్ప పెర్ఫామ‌ర్ గా అంద‌రి దృష్టిలోనూ ప‌డింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా టాలీవుడ్ లో అర‌డ‌జ‌ను అవ‌కాశాలు అందుకోగ‌లిగిందంటే అదే కార‌ణం. ఇప్ప‌టికీ హెబ్బా ప‌టేల్ కి అవ‌కాశాలొస్తున్నాయి.

స్టార్ డ‌మ్ అమాంతం పెర‌గ‌క‌పోయినా త‌న స్థాయి సినిమాలు తాను చేసుకుంటూ పోతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా హెబ్బా ఇన్ స్టా వేదికగా బోల్డ్ ఫోటో షూట్ ని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. షోల్డ‌ర్ అందాల‌ను థై సొగ‌సుల్ని ఎలివేట్ చేస్తున్న ఆ పొట్టి ఫ్రాకులో మెంటలెక్కిస్తోంది. ఈ ఫోటోకి కుమారి 32ఎఫ్ రీలోడెడ్! అంటూ అభిమానులు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. హెబ్బా ఏజ్ ఇప్పుడు 32.. మ‌రి సుకుమార్ శిష్యుడు ప్ర‌తాప్ త‌న‌తో కుమారి సీక్వెల్ తీస్తాడేమో చూడాలి.

హెబ్బా ఇటీవ‌లే నితిన్ భీష్మ‌లో అతిథిగా మెరిసింది. భీష్మ పెద్ద విజ‌యం అందుకుంది. ఇస్మార్ట్ రామ్ రెడ్ లోనూ దించ‌క్ సాంగ్ లో న‌ర్తించింది. 2021లోనే `ఒదేలా రైల్వేస్టేష‌న్`.. `తెలిసిన‌వాళ్లు` అనే రెండు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.
Tags:    

Similar News