ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా చప్పుడు చేయకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న హలో గురు ప్రేమ కోసమే ఫస్ట్ లుక్ ని రేపు రామ్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందుగా విడుదల చేసారు. గత ఏడాది వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో కుర్రాడి ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. టైటిల్ యూత్ కి నచ్చేలా చాలా క్యాచీగా ఉండటం బాగా ప్లస్ అవుతోంది.ఎప్పుడో పాతికేళ్ళ క్రితం వచ్చిన నాగార్జున నిర్ణయం సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ లోని మొదటి లైన్ ను టైటిల్ గా పెట్టుకున్న రామ్ ఇందులో లవర్ బాయ్ గానే కనిపిస్తున్నా లుక్స్ లో మాత్రం ఏదో కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నాడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ కు సూట్ అయ్యే రామ్ ఆ వింగ్ నుంచి బయటికి వచ్చి చేసిన మాస్ సినిమాలు అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే తన పాత స్కూల్ కు వచ్చేసాడు.
హలో గురు ప్రేమ కోసమే అనే పాట ఎంత పాతదైనా తరాలకు అతీతంగా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఇళయరాజా సంగీతానికి సిరివెన్నెల సాహిత్యం పోటీ పడుతూ కదం తొక్కడంతో సినిమా యావరేజ్ గా ఆడినా ఈ ఒక్క పాట మాత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అందుకే తమ కథకు సూట్ అయ్యే ఈ పేరు పెట్టాము అంటున్నారు దర్శక నిర్మాతలు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరొయిన్. రామ్ తో ఉన్నది ఒకటే జిందగీలో చేసింది కాని అందులో కేవలం ఫస్ట్ హాఫ్ కు మాత్రమే పరిమితమయ్యే రోల్. కాని ఇందులో హీరొయిన్ తనే కాబట్టి తనకే పూర్తి స్కోప్ ఉంటుంది. నేను లోకల్ లాంటి సూపర్ హిట్ తర్వాత నక్కిన త్రినాధ రావు చేస్తున్న మూవీ కాబట్టి అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికైతే ఫస్ట్ లుక్ మాత్రమే ఇచ్చారు. విడుదల తేది చెప్పడానికి ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది . సాఫ్ట్ లుక్ తో రామ్ ఉండగా అతన్ని పట్టించుకోని కాలేజీ స్టూడెంట్ గా అనుపమ మొత్తానికి ఏదో యూత్ ఫుల్ కాన్సెప్ట్ తోనే వస్తున్నట్టు ఉన్నారు. దిల్ రాజు నిర్మాణం కాబట్టి నిశ్చింతగా ఎదురు చూడొచ్చు