ఫోటో స్టోరీ: ఇద్దరూ డ్రీమ్ గాళ్సేనబ్బా

Update: 2016-12-02 05:01 GMT
తెరపై ఒక్క డ్రీమ్ గాళ్ ఉంటేనే.. స్క్రీన్ నిండుగా ఉంటుంది. అలాంటిది ఒకేసారి ఇద్దరు డ్రీమ్ గాళ్స్ ను స్క్రీన్ పై చూపించబోతున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమమాలిని (ఒకప్పుడు).. సౌత్ డ్రీమ్ గాళ్ శ్రియా శరణ్ లు.. శాతకర్ణిలో స్క్రీన్ పంచుకున్న సంగతి తెలిసిందే.

గౌతమిపుత్ర శాతకర్ణికి తల్లి గౌతమి పాత్రకు ఏరికోరి మరీ హేమమాలిని ఎంచుకున్నాడు బాలయ్య. అలాగే భార్య వశిష్టీ దేవి పాత్రకు శ్రియను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ ఇద్దరూ కలిసి పక్కపక్కనే సింహాసనం పై కూర్చున్న ఫోటో ఒకటి ఇప్పుడు తెగ షేరింగ్ అయిపోతోంది. ప్రస్తుతం హేమమాలిని వయసు 68 సంవత్సరాలు. అయినా సరే.. ఆమె ఫేస్ లో కనిపిస్తున్నా.. ఛామ్.. గ్లో చూస్తుంటే.. జస్ట్ ఫార్టీ ప్లస్ అనిపించక మానదు. ఇక రాణి రోల్ లో శ్రియలో కనిపిస్తున్న సెక్స్ అప్పీల్ అయితే అదరహో అనాల్సిందే. ఇద్దరూ కలిసి కనిపిస్తన్న పిక్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే.

34 ఏళ్ల వయసులోనూ సౌత్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ బ్యూటీ శ్రియ. బేసిక్ గా డ్యాన్సర్ కావడంతో తనలోని అందచందాలను కాపాడుకోవడం ఈమెకు కొట్టిన పిండి. ఒకరు 68.. ఇంకొకరు అందులో సగం 34.. ఇలాంటి ఇద్దరు డ్రీమ్ గాళ్స్ ను ఒకే స్క్రీన్ పైకి తీసుకొచ్చిన శాతకర్ణి టీంని అభినందించాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News