మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. అభ్యర్థులు.. ప్రత్యర్థుల ఆరోపణలతో నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ `మా`ని మరీ రచ్చ కీడుస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ తన ప్యానెల్ తో అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా ఇదే తరహాలో మంచు విష్ణు కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.
నామినేషన్‌ల పర్వం ముగిసిన దగ్గరి నుంచి ఈ రెండు ప్యానెల్ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా కరాటే కల్యాణి వర్సెస్ హేమల మధ్య మాట యుద్ధం మొదలైంది. తన ఫొటోలని మార్ఫింగ్ చేసి తన పరువు తీయాలని చూస్తున్నారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న హేమ తాజాగా పోలీసులని ఆశ్రయించడం .. తన దగ్గర ఎన్నో ఆధారాలు వున్నాయని అవన్నీ బయటపెడతామని తనని మంచు విష్ణు ప్యానెల్‌కు చెందిన కరాటే కల్యాణీ.. మాజీ అధ్యక్షుడు నరేష్ భయపెడుతున్నారని హేమ సంచలన ఆరోపణలు చేసింది.
అయితే హేమ ఆరోపణలకు కరాటే కల్యాణీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంచు విష్ణు ప్యానెల్ తరుపున పోటీపడుతున్న కరాటే కల్యాణీ .. హేమ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. తమ దగ్గర వున్న సాక్ష్యాలున్నాయని.. అవి బయటపెడతామన్నారు. నీ ఓటు గురించి నువ్వు అడగటం మానేసి.. కల్యాణీని ఓడించండి అంటూ క్యాంపెయిన్ చేయడంలోనే నువ్వు ఎంత వీకో అర్థమవుతోందని.. అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో ఏ ఏ ఫొటోలు పంపి డిలీట్ చేస్తున్నావో అందరూ చూస్తున్నారని.. ఎక్కువ మాట్లాడితే మా దగ్గర చాలా వున్నాయని అవి అన్నీ బయటకు తీయాల్సి వస్తుందని కరాటే కల్యాణీ హేమని హెచ్చరించడం `మా`లో కొత్త వివాదానికి తెరలేపింది.