అహం బ్ర‌హ్మ‌స్య‌.. హీరోగారి వైఫ్ పై అహం విసిరిన పంచ్!

Update: 2022-09-07 23:30 GMT
అహం బ్ర‌హ్మస్మి.. అహం లేనిదే మ‌నిషి లేడు. అయితే ఈ అహంభావాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన చోట మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించాలి. అసంద‌ర్భంగా అహాన్ని ప్ర‌ద‌ర్శిస్తే అది అస‌లుకే చేటు. ఇటీవ‌లి కాలంలో ఈ అహంభావం కుటుంబ జీవ‌నాన్ని క‌ల్లోలంలో ముంచేస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది.

ప్ర‌ముఖ స్టార్ హీరో కుటుంబంలో ఇలాంటి ఒక క‌ల్లోలం ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డింది. స‌ద‌రు స్టార్ హీరో సోద‌రుడు త‌న భార్య‌కు విడాకులిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఈ జంట సంఘంలో హై ప్రొఫైల్ కావ‌డంతో అందులో అంత‌గా ప‌ట్టింపు లేదు. పైగా క‌లిసే ఉంటున్నా విడిగా ఉన్న ఈ జంట గురించి ఫిల్మిండ‌స్ట్రీకి కూడా బాగా తెలుసు. ఇక‌పోతే స‌ద‌రు హీరో కం నిర్మాత నుంచి భార్యామణి విడిపోవ‌డానికి కార‌ణం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది.

ఒక ర‌కంగా చెప్పాలంటే మేల్ డామినేష‌న్ ని ఇష్ట‌ప‌డ‌ని భార్యామ‌ణిగా త‌న ఆలోచ‌న‌లే ఇందుకు కార‌ణం. ఆ విష‌యాన్ని చూఛాయ‌గా ఆమె బ‌య‌ట‌పెట్టేసింది. పురుషాధిక్యం అంటే అస్స‌లు స‌రిప‌డ‌దు త‌న‌కు. అయినా మొగుళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో స్త్రీ(భార్య‌)ని చూస్తే నాకు అస్స‌లు న‌చ్చ‌దు! అంటూ బ‌హిరంగంగానే ఈ అమ్మ‌డు వ్యాఖ్యానించింది.

''ఇక బాలీవుడ్ భార్యను కాదు'' అని వ్యాఖ్యానించిన స‌ద‌రు భార్యామ‌ణిపై ట్రోల‌ర్స్ విరుచుకుప‌డ్డారు. స్త్రీలను వారి భర్తలు నిర్వచిస్తార‌ని నాకు తెలియదు! అంటూ చాలా ఘ‌రానాను ప్ర‌ద‌ర్శించిన తీరు.. అహాన్ని వ్య‌క్తం చేసిన తీరు నెటిజ‌నుల‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు.

ప్ర‌స్తుతం ఈ హై ప్రొఫైల్ భార్యామ‌ణి నెటిజ‌నుల నుంచి తీవ్ర‌మైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది. సోష‌ల్ మీడియాల్లో ఇది డిబేట్ గా మారింది. ఈ భామ హీరోగారితో 24 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ ఏడాది ప్రారంభంలోనే ముగింపు పలికారు.

త‌మ‌కు పిల్ల‌లు ఉన్నా దేనినీ ప‌ట్టించుకోక‌పోగా ప్రతిసారీ ప‌బ్లిక్ వేదిక‌ల‌పైనే భ‌ర్త‌పై అహాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం బ‌య‌ట‌ప‌డ‌టాన్ని ట్రోల‌ర్లు ఎత్తి చూపుతున్నారు. ఇక త‌న భ‌ర్త వైపు నుంచి ఇలాంటి వేషాలేవీ బ‌య‌ట‌ప‌డిన సంద‌ర్భాలేవీ లేక‌పోవ‌డంతో అత‌డికి నెటిజ‌నుల నుంచి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News