కథను అమ్ముకుంటే ఇన్ని కోట్లా.?

Update: 2018-07-09 10:54 GMT
బాలీవుడ్ అగ్రహీరో సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘సంజు’. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. వసూళ్ల విషయంలో దూసుకుపోతోంది. ఇప్పటికే గ్రాస్ వసూళ్ల విషయంలో 200 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. ప్రస్తుతం 250 కోట్ల రూపాయల దిశగా పయనిస్తోంది. తద్వారా ప్రీరిలీజ్ మార్కెట్ లెక్కలను అధిగమించేస్తోంది. దీంతో దీని నిర్మాతలకు - పంపిణీదారులకు లాభాల పంట పండినట్టే అని విశ్లేషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తన బయోపిక్ సినిమాకు లాభాల వాన కురవడంపై సంజయ్ దత్ కూడా హ్యాపీగా ఉన్నాడట..ఈ సినిమా కథపై హోల్ సేల్ రైట్స్ ను కలిగి ఉన్న సంజయ్ దత్ కు  లాభాల్లో షేర్ వస్తోందట.. సినిమా ప్రారంభానికి ముందే సంజయ్ దత్ జీవిత కథను తీయడానికి దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అండ్ టీం పదికోట్ల రూపాయల మొత్తాన్ని ఈ హీరోకి ఆఫర్ చేసిందట.. హిట్ అయితే లాభాల్లో వాటా కూడా ఇస్తామని హామీ ఇచ్చారట.. కేవలం తన ప్రమేయం లేకుండానే సినిమాకు ముందే పది కోట్లు సంపాదించి సంజయ్ వార్తల్లో నిలిచారు.

ఇక ప్రస్తుతం సినిమా లాభాల్లో కూడా సంజూకు వాటా దక్కుతోంది.  ఎంతలేదన్నా కనీసం మరో 20 కోట్ల వరకూ సంజయ్ దత్ కు రాబోతున్నాయట.. ఇలా ఎలాంటి ప్రమేయం లేకుండానే సంజయ్ దత్ కు కోట్లు వచ్చిపడడం చూస్తుంటే అతడు నక్కను తొక్కినట్టే కనిపిస్తోంది.
Tags:    

Similar News