బాలకృష్ణ అఖండ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన అఖండ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలయ్య తో సినిమా చేస్తున్నాడు. రియల్ స్టోరీకి కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి బాలయ్య తో గోపీచంద్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ గత చిత్రం క్రాక్ కూడా రియల్ పాత్రల ఆధారంగా రూపొందిందే అనే విషయం తెల్సిందే. కథ ఇప్పటికే ఫైనల్ అయ్యింది.. ఇక సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఆసక్తిని పెంచేస్తోంది.
అఖండ సినిమా తో పాటు బాలయ్య అంతకు ముందు నటించిన సినిమాల్లో విలన్స్ గా సీనియర్ స్టార్ హీరోలు నటించిన విషయం తెల్సిందే. లెజెండ్ లో బాలకృష్ణ ను జగపతి బాబు ఢీ కొట్టగా.. అఖండ లో శ్రీకాంత్ తో బాలయ్య ఫైట్స్ ను చూడటం జరిగింది. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తో పోరాడబోతున్న విలన్ ఎవరు అనే విషయం లో జరుగుతున్న చర్చకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడ్డట్లే. కన్నడం తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న యాక్షన్ కింగ్ అర్జున్ ను ఈ సినిమా లో విలన్ పాత్రకు గాను ఎంపిక చేశారు అనే వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
బాలయ్య మరియు అర్జున్ ల కాంబో ఖచ్చితంగా సినిమా స్థాయిని పెంచుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈమద్య కాలంలో అర్జున్ ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. తెలుగు మరియు తమిళంలో అర్జున్ నటించిన సినిమా లకు మంచి ఆధరణ ఉంటాయి. కనుక బాలయ్య సినిమా కు ఆయన ఖచ్చితంగా ప్లస్ అవుతాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా కు వంద కోట్ల కు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. కనుక గోపీచంద్ మలినేని సినిమా కూడా అంతకు మించి వసూళ్లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి బాలయ్య కు మరో విజయాన్ని ఈ దర్శకుడు ఇస్తాడా అనేది చూడాలి.