ఫిలింనగర్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద ఊహించని రీతిలో చోటు చేసుకున్న నిరసన సంచలనంగా మారింది. షాకిచ్చేలా ఉన్న ఈ నిరసనలోకి వెళితే.. దుర్గాప్రసాద్ హీరోగా రూపొందించిన నానిగాడు సినిమాను ఎవరో యూట్యూబ్ లో పెట్టేశారట. దీంతో.. చిత్ర హీరో సినిమా పోస్టర్ పట్టుకొని ఫిలింఛాంబర్ ఎదుట నిరసనకు దిగారు.
రూ.40 లక్షలు పెట్టి తాము నానిగాడు సినిమా తీశామని..సెన్సార్ పూర్తయ్యిందన్నారు. క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చిందని.. సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటే.. ఎవరో యూట్యూబ్ లో తమ సినిమా మొత్తాన్ని అప్ లోడ్ చేసేశారన్నారు. ఈ ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న సదరు హీరో.. యూట్యూబ్ లో లింక్ ను వెంటనే తొలగించి న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో రేపు (బుధవారం) తాను చిత్ర యూనిట్ తో సహా ఫిలింఛాంబర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.