`సఖి` సినిమాతో మాధవన్ ప్రతిభ ఏంటో తెలుగు ప్రేక్షకులకు అర్థమైంది. మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ అతడిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ `సఖి` సినిమాతో మరోసారి మాధవన్ పేరు మార్మోగింది. మ్యాడీ అలియాస్ మాధవన్ లో ఏదో సంథింగ్ స్పెషాలిటీ ఉందని అంగీకరించారు. సౌత్ సహా అటు బాలీవుడ్ లోనూ మ్యాడీకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిన సినిమాలు ఇవి. అంతకుముందు టీవీ నటుడిగా మోడల్ గా సుపరిచితుడైన మాధవన్ ఇక సఖి- చెలి తర్వాత కెరియర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. అతడు అమీర్ `3 ఇడియట్స్` లో ఒకరిగా నటించారు. అటుపై `తను వెడ్స్ మను` సంచలన విజయం సాధించాక తన లెవల్ స్కైని టచ్ చేసింది. మాధవన్ నటించిన బాలీవుడ్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడం ఒక సంచలనం. అభిషేక్ గురూ చిత్రంలోనూ మ్యాడీ నటవిన్యాసాలకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.
సౌత్ నుంచి ఎదురే లేని స్టార్ గా .. గొప్ప పెర్ఫామర్ గా మాధవన్ కి గుర్తింపు దక్కింది. ఇప్పటికే కెరీర్ లో ఎన్నో ఫిలింఫేర్ లు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి. ఇటీవలే నాగచైతన్య నటించిన సవ్యసాచి చిత్రంలో మ్యాడీ ప్రతినాయక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా మ్యాడీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మునుముందు మాధవన్ తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తారనే ఆశిద్దాం.
ఇకపోతే మాధవన్ ఓ సినిమాకి అంగీకరించారు అంటే అందులో సంథింగ్ ఏదైనా ప్రత్యేకత ఉండాల్సిందే. కథ పరంగా.. అతడి పాత్ర పరంగా క్యాలిబర్ ఉంటేనే అంగీకరిస్తారు. 1970 జూన్ 1న జన్మించిన మాధవన్ వయసు 49. అర్థ సెంచరీకి దగ్గరగా ఉన్నా ఇంకా 30 ప్లస్ కుర్రాడిలానే ఎంతో జోష్ తో కనిపిస్తాడు. విద్యార్థి దశలో అతడు 22 వయసులో ఎన్ సీసీ క్యాడెట్ గా మహారాష్ట్ర నుంచి గుర్తింపు పొందాడు. ఆర్మీ- నేవీ- ఎయిర్ ఫోర్స్ నుంచి శిక్షణ పొందేందుకు ఆహ్వానం అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఫక్తు ఫ్యామిలీ మ్యాన్ గా మాధవన్ తన కుమారుడి ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేశాడు. సౌతిండియాలోనే సక్సెస్ ఫుల్ హీరోగా మాధవన్ ఎదురేలేని ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. రాకెట్ సైంటిస్ట్ తంబి నారాయణన్ బయోపిక్ లో ప్రస్తుతం నటిస్తూ బిజీగా ఉన్నాడు. హ్యాపి బర్త్ డే టు మ్యాడీ. పుట్టిన రోజు సందర్భంగా అభిమాని ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.