హీరో నాగ శౌర్య, జూనియర్ ఎన్టీఆర్ లు బంధువులా.. నిజమెంత?

Update: 2022-04-04 01:30 GMT
టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ కథానాయకుడంటే అమ్మాయిలకు యమ క్రేజ్. ఈయన నటించే రొమాంటిక్ సినిమాలు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అంతే కాదండోయ్ ఆయన పండించే ఎమోషన్స్ కు కూడా ప్రత్యేకమైన ప్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న ఈ నటుడికి అంత పెద్ద గుర్తింపు రాలేదు.

నాగశౌర్య సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇతడికి... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బంధుత్వం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఆజ్యం పోసినట్లుగా.. నాగశౌర్య కూడా తానిచ్చే చాలా ఇంటర్వ్యూల్లో నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడడం, గొప్పగా చెప్పాడు. నాగశౌర్య మాటలతో అందరూ వారిద్దరికీ నిజంగానే చుట్టరికం ఉందనుకున్నారు.

అయితే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి పదకొండేళ్లు అవుతున్నా ఈ పుకార్లపై ఏ ఒక్కరూ స్పందించలేదు.  హీరో నాగశౌర్యకు జూనియర్ ఎన్టీఆర్ కు బంధుత్వం ఉందంటూ గత కొన్నేళ్లుగా వస్తున్న వార్తలపై నాగశౌర్య తల్లి ఉష స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె... జూనియర్ ఎన్టీఆర్ కు నాగ శౌర్యకు ఎలాంటి బంధుత్వం లేదని స్పష్టం చేసింది.

 అయితే నాగశౌర్యకు నందమూరి ఫ్యామిలీ అంటే ఇష్టం మాత్రం ఉందని పేర్కొంది. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్... శౌర్యకి స్నేహితురాలని వివరించింది. అంతకు మించి హీరో నాగ శౌర్యకు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి బంధుత్వం లేదని స్పష్టం చేసింది.

కానీ ఇలాంటి వార్తలు ఎందుకు పుకార్లుగా మారాయో తనకు అర్థం కాలేందంటూ వ్యాఖ్యానించింది. పర్సనల్ గా నాగశౌర్యకి వాళ్లంటే గౌరవం.. అందుకే ఇంటర్వ్యూల్లో వారి గురించి మాట్లాడాడాని దానికే చుట్టరికం కలపడం ఆశ్చర్యంగా ఉందంటూ నాగశౌర్య తల్లి ఉష అన్నారు. కేవలం మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ యే తప్ప బంధువులం కాదంటూ మరోసారి స్పష్టం చేసింది.

ఉష తన కొడుకు నాగశౌర్య గురించి చెప్తూ... వాడు తన మెబైల్ పోన్ ను కూడా వెంట తీసుకెళ్లడు. వాడు చాలా స్పెషల్ అంటూ వివరించింది. అలాగే వాడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే పాత్రలను చేస్తున్నాడని... అదే వాడిని ప్రత్యేకమైన వాడిగా నిలబెట్టిందంటూ వివరించింది.
Tags:    

Similar News