కింగ్ నాగార్జున ఆస్తుల చిట్టా ఇదీ

Update: 2019-02-13 06:00 GMT
టాలీవుడ్ లో కింగ్ నాగార్జున ఆల్ రౌండ‌ర్‌ నైపుణ్యం గురించి, ఆయ‌న ఆర్జ‌న గురించి ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగుతుంటుంది. లెజెండ్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట‌వార‌సుడిగా ప‌రిశ్ర‌మ‌లో ఆరంగేట్రం చేసినా, ఆ త‌ర్వాత స్టార్ గా తన‌దైన మార్క్ వేసి ఇండ‌స్ట్రీ అగ్ర కథానాయ‌కుడిగా ఎదిగారు. స్టైల్ అన్న ప‌దానికి అత‌డు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచారు. నాగార్జున అంటే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. తండ్రి లెగ‌సీని కాపాడ‌డ‌మే గాక‌.. అసాధార‌ణ‌మైన‌ హార్డ్ వ‌ర్క్, డెడికేష‌న్ తో అంచెలంచెలుగా ఎదిగాన స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. సినిమా రంగంతో పాటు, రియ‌ల్ ఎస్టేట్, హోట‌ల్ బిజినెస్‌లో అనుభ‌వ‌జ్ఞుడిగా ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో అత‌డు ఇంతింతై అన్న చందంగా ఎదిగార‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోగా, నిర్మాత‌గా సంపాదించిన దాని కంటే అత‌డు ర‌క‌ర‌కాల వ్యాపార మార్గాల ద్వారా ఆర్జించిన‌ది అంత‌కుమించి అని విశ్లేషిస్తుంటారు.

1986లో విక్ర‌మ్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి మూడు ద‌శాబ్ధాల కెరీర్ ని విజ‌య‌ప‌థంలో న‌డిపించారు. ఇప్ప‌టికి 91 సినిమాల్లో న‌టించారు. హీరోగా, అతిధి పాత్ర‌లు క‌లిపి వీకీ స‌మాచారం ప్ర‌కారం గ‌ణాంక‌మిది. కింగ్ న‌టించే 92వ సినిమా త్వ‌ర‌లో సెట్స్ కెళుతోంది. మ‌రో రెండు మూడేళ్ల‌లోనే సెంచ‌రీ కొట్టేయ‌బోతున్నారు నాగార్జున‌. త‌న‌ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్లు, సంచ‌ల‌న విజ‌యాల‌కు కొద‌వేం లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కింగ్ నాగార్జున‌. బాలీవుడ్ లో అమితాబ్ అంత‌టి బిగ్ స్టార్ తో క‌లిసి `ఖుదాగ‌వా` అనే చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నేతృత్వంలోని `బ్ర‌హ్మాస్త్ర` అనే చిత్రంలో అతిధి పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ‌ల‌యాళంలో `మ‌రక్కార్` అనే హిస్టారిక‌ల్ మ‌ల్టీస్టార‌ర్ లో ప్ర‌ధానమైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంత‌టి గ్రేట్ రికార్డ్ ఉన్న నాగార్జున ఈ మూడు ద‌శాబ్ధాల్లో ఎంత సంపాదించి ఉంటారు? అని ప్ర‌శ్నిస్తే ఆయ‌న ఆస్తులు ఏకంగా రూ.850 కోట్లు విలువ‌ను క‌లిగి ఉన్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏడాదికి రూ.30కోట్ల వార్షికాదాయంతో కింగ్ ఇన్నేళ్ల‌లో ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడ‌బెట్టిన ఆస్తులివి.

హైద‌రాబాద్ లో ఆయ‌న నివ‌శించే బంగ్లా ఖ‌రీదు రూ.43 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.  ఇంటి గ్యారేజ్ లో ఖ‌రీదైన కార్ల‌కు కొద‌వేం లేదు. రేంజ్ రోవ‌ర్ ఎవోక్ -65 ల‌క్ష‌లు, ఆడి ఏ7- 1.02కోట్లు, బీఎండబ్ల్యూ 7 సిరీస్- 1.32 కోట్లు, మెర్సిడెస్ ఎస్ క్లాస్ -3కోట్లు విలువ‌ను క‌లిగి ఉన్నాయి. ఇంకా ప‌లు ర‌కాల స్పోర్ట్స్ గూడ్స్, గాడ్జెట్స్ విలువ కోట్ల‌లోనే ఉంటుందిట‌. ఇక హైద‌రాబాద్ లోని ఖ‌రీదైన ప్రైమ్ ఏరియాలో ఉన్న ఎన్- క‌న్వెన్ష‌న్ కొన్ని ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలో ప‌లు చోట్ల ప‌బ్స్, ఖ‌రీదైన రెస్టారెంట్స్, క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులు నాగార్జున ర‌న్ చేస్తున్నారు. వీట‌న్నిటి నుంచి వార్షికాదాయం అసాధార‌ణంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ (రికార్డింగ్‌- డ‌బ్బింగ్- డిజిట‌ల్- అన్న‌పూర్ణ ఫిలింస్కూల్ వ‌గైరా), అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో ఇండోర్ స్టూడియోస్ వంటివి ఆయ‌న ఆస్తుల్లో భాగం. ర‌క‌ర‌కాల మార్గాల్లో సినీప‌రిశ్ర‌మ నాగార్జున కుటుంబం సేవ‌లు అందించ‌డంపైనా నిరంత‌రం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.


Tags:    

Similar News