అ! తర్వాత మరో ఆసమ్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నాడట!

Update: 2019-04-17 09:27 GMT
న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'జెర్సీ' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో 'జెర్సీ' ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు.  ఈ సినిమాతో పాటుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని 'గ్యాంగ్ లీడర్' అనే మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నటించే మరో సినిమా కూడా లైన్లో ఉంది.  హీరోగా నటించే ఈ సినిమాలే కాకుండా నిర్మాతగా కూడా ఒక క్రేజీ ప్రాజెక్టును సెట్ చేస్తున్నాడట నాని.

నాని నిర్మాతగా మారి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై మొదటి ప్రయత్నంగా 'అ!' అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు భారీ ప్రశంసలు దక్కాయి. అప్పటి నుండి నాని రెండో సినిమాకోసం ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతూ ఉన్నాడట.  రీసెంట్ గా ఆస్ట్రేలియా కు చెందిన ఒక ఎన్నారై ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ తో నాని ని కలవడం జరిగిందని సమాచారం. ఆ డెబ్యూ దర్శకుడి నేరేషన్ నచ్చడంతో వెంటనే సినిమా నిర్మించేందుకు నాని రెడీ అయ్యాడట.

ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కనుందని.. ఈ స్క్రిప్ట్ కు సూటయ్యే యాక్షన్ హీరో కోసం ఆల్రెడీ వెతకడం మొదలు పెట్టారని సమాచారం.  ఆగష్టు నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్లాన్ లో ఉన్నాడట. నానికి మంచి స్క్రిప్ట్ లు ఎంచుకుంటాడనే పేరు ఉంది. మరో కొత్త దర్శకుడి స్క్రిప్ట్ ను నమ్మాడు అంటే స్క్రిప్ట్ లో మంచి విషయం ఉన్నట్టే లెక్క.  త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.  
Tags:    

Similar News