ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పరుగు' చిత్రాన్ని హిందీలో 'హీరో పంతి' పేరుతో రీమేక్ చేశారు. మోర్ యాక్షన్ ని యాడ్ చేసి హిందీ కి అనుగుణంగా మార్పులు చేసి రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ మూవీలో క్రితిసనన్ హీరోయిన్ గా నటించింది. 2014లో వచ్చిన ఈ చిత్రానికి ఇన్నేళ్ల తరువాత సీక్వెల్ పేరుతో 'హీరో పంతి 2' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా, తారా సుతారియా హీరోయిన్ గా నటించింది. సాజిద్ నదియావాలా నిర్మించిన ఈ చిత్రాన్ని అమ్మద్ ఖాన్ తెరకెక్కించారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, జాకీర్ హుస్సేన్, అమృతా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. 'హీరో పంతి'లో హీరోయిన్ గా నటించిన క్రితి సనన్ ఈ చిత్రంలో ని ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. భారీ రోమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. పేరుకు 'హీరో పింతి' సీక్వెల్ అని చెబుతున్నా మరో తెలుగు సినిమాని కాపీ చేస్తూ ఈ మూవీని బాలీవుడ్ స్టైల్లో టైగర్ ష్రాఫ్ మార్కు యాక్షన్ అంశాలని జోడించి తెరకెక్కించినట్టుగా చెబుతున్నారు.
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. టైగష్రాఫ్ కు తల్లిగా అమృతా సింగ్ నటించింది. అస్లీ హీరో పంతి లోగోంసే జీత్‌నేమే నహీ .. లోగోంకో జీత్‌నేమే హై..' అంటూ చిరిగి పేలికలైన డ్రెస్ లో టైగర్ ష్రాఫ్ నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ తో ట్రైలర్ మొదలైంది. టైగర్ ష్రాఫ్ సినిమా అంటే యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే వుండదు. అవే ప్రధానం.. ప్రదాన బలం కూడా. ఇందులోనూ అలాంటి హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేవాలు, ఛేచింగ్ లు చాలానే వున్నాయి.
ఇండియాని చీట్ చేసి స్టాక్ మార్గెట్ డబ్బులన్నీ కొట్టేయాలని ప్లాన్ చేసిన లైలా ( నవాజుద్దీన్ సిద్ధిఖీ) గ్యాంగ్ కి బబ్లూ ఎలి బుద్ది చెప్పాడు? .. అనే కథతో ఈ చిత్రాన్ని ఫుల్ ఆఫ్ యాక్షన్ సన్నివేశాలతో ప్యాక్ చేసినట్టుగా కనిపిస్తోంది. చైనీస్ ఫైటర్ లతో చేసే యాక్షన్ ఘట్టాలు, ట్రైన్ బ్లాస్టింగ్.. ఫ్లైయింగ్ కిక్స్.. థ్రిల్లింగ్ స్టంట్స్ తో టైగర్ ష్రాఫ్ అదరగొట్టేశాడు. ఓ రేంజ్ లో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ ట్రైలర్ ఆసాంతం మెరుపులు మెరిపించింది.
భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే టైగర్ ష్రాఫ్ ప్రియురాలు, హీరోయిన్ దిషా పటాని రివ్యూ ఇచ్చేసింది. వన్ వర్డ్ లో సినిమా ఎలా వుండబోతోందో చెప్పేసింది.
ఫుల్ విజిల్ బజా ట్రైలర్ అంటూ ప్రియుడు టైగర్ ష్రాఫ్ కు కన్ను కొడుతున్న ఎమోజీలతో విషేస్ చెప్పేసింది. ప్రస్తుతం ట్రైలర్ తో పాటు దిషా పటాని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా షేర్ చేసి ట్రైలర్ రివ్యూ వైరల్ గా మారింది.
Full View