యువ కథానాయకుడు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగితే అదెంత సంచలనంగా మారుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. సోమవారం రాత్రి నార్సింగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఖరీదైన కారు ఉండటం.. అది కాస్తా హీరో తరుణ్ గా వార్తలు రావటం తెలిసిందే. మంగళవారం ఉదయం పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా మారి.. అటు ఛానళ్లలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ వైరల్ అయ్యింది.
అయితే.. ఆ రోడ్డు ప్రమాదంలో తనకెలాంటి సంబంధం లేదని తన పీఆర్వో ద్వారా స్పష్టం చేశాడు తరుణ్. మరి.. అతనిది కాకుంటే.. ఎవరిది? అన్న సందేహాల నడుమ.. కారు యజమాని ఎవరు? ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమేరాల సంగతేమిటన్న లోతుల్లోకి వెళ్లిన వారికి.. ప్రమాదానికి కారణం యువ హీరో రాజ్ తరుణ్ అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది.
అప్పటి నుంచి టీవీల్లోనూ.. మిగిలిన మాధ్యమాల్లోనూ ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. అయితే.. దీనిపై రాజ్ తరుణ్ స్పందించింది లేదు. సీసీ కెమేరా పుటేజ్ లలో స్పష్టంగా కనిపించిన తర్వాత కూడా అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో పలు వాదనలు వినిపించాయి. ఇది అంతకంతకూ పెరగటం వల్లో ఏమో కానీ.. తాజాగా రాజ్ తరుణ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. సోమవారం అర్థరాత్రి ఏం జరిగిందో వివరించారు.
నాకు ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవటానికి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. గడిచిన మూడు నెలలుగా ఇంటి నుంచి నార్సింగ్ సర్కిల్ గా ప్రయాణిస్తున్నా. అక్కడ తరచూ ప్రయాణాలు జరుగుతుంటాయి. అక్కడే సడన్ గా రైట్ టర్న్ తీసుకోవటంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టాను. పెద్ద శబ్దం రావటంతో షాక్ కు గురయ్యా. సీటు బెల్ట్ పెట్టుకోవటం వల్ల ప్రమాదం జరగలేదు. దెబ్బలేమైనా తగిలాయా? అని చూసుకొని భయంతో ఇంటికి పరిగెత్తుకెళ్లా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా.. త్వరలోనే షూటింగ్ కు హాజరవుతా అని ట్వీట్ చేశారు. జరిగింది చెప్పటానికి.. భయం తగ్గటానికి.. సోషల్ మీడియాలో అసలేం జరిగిందో చెప్పటానికి రెండు రోజులు పట్టిందా రాజ్ తరుణ్?