షాకింగ్ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రవాణా శాఖ. ప్రముఖ తెలుగు హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆర్నెల్ల పాటు ఈ రద్దు నిర్ణయం కొనసాగనుంది. గడిచిన కొంతకాలంగా ఆయన వాహనాన్ని నడుపుతూ ప్రమాదాలకు కారణమైన నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. నవంబరు 12న ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆయన నడుపుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
ఆ సమయంలో రాజశేఖరే స్వయంగా కారు నడిపారు. అమితమైన వేగంతో ఉన్నప్పటికీ.. సీటు బెల్టు పెట్టుకోవటం ఆయన ప్రాణాల్ని కాపాడేలా చేసింది. దీనికి తోడు కారు ఖరీదైనది కావటం.. అత్యాధునిక ఫీచర్లు ఉండటం అంత ప్రమాదం జరిగినా.. ఆయనకేమీ కాలేదు.
గతంలోనూ ఆయన కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ భావించింది. ఇందులో భాగంగా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసినట్లుగా తెలిసింది. వాస్తవానికి ఆయన డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి 2017లోనే ముగిసినట్లుగా చెబుతున్నారు.
అయినప్పటికీ ఆయన తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోలేదు. దీనికి తోడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యారు. వరుస ప్రమాదాలు అది కూడా నిర్లక్ష్యం.. అతి వేగంగా చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయకూడదని అధికారులు నిర్ణయించారు. ఒక ప్రముఖుడి విషయంలో రవాణా శాఖ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.