బాలీవుడ్ హీరోను టపోరిగా మార్చిన రామ్

Update: 2019-08-06 06:44 GMT
అందరూ రామ్ ను ఎనర్జిటిక్ స్టార్ అని పిలుస్తారు కానీ రామ్ లో ఉండే ఎనర్జీ గురించి మాత్రం మర్చిపోయారు. కానీ 'ఇస్మార్ట్ శంకర్' తో మరోసారి రామ్ తన ఎనర్జీ ఎలా ఉందో  ప్రేక్షకులకు చూపించాడు.  'ఉస్తాద్ ఇష్మాట్ శంకర్' అంటూ అందరినీ క్లీన్ బౌల్డ్ చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 'ఇస్మార్ట్ శంకర్' రిలీజ్ అయిపొయింది కాబట్టి గెటప్ ను మార్చి ఇప్పుడు రెగ్యులర్ లుక్ లోనే ఉన్నాడు. నిన్న రామ్ ముంబైకి వెళ్ళి అక్కడ మాజీ హీరోయిన్ జెనీలియా బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు.

రామ్ - జెనీలియా జంటగా నటించిన 'రెడీ' ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.  జెనీలియా అల్లరి.. రామ్ ఎనర్జీ.. ఇద్దరి జోడీ అందులో అందరినీ ఆకట్టుకుంటుంది.  ఇక సినిమాలో కామెడీ గురించి చెప్పనవసరమే లేదు.  ఆ సినిమాలో నటించినప్పటి నుంచి రామ్ - జెనీలియా మంచి దోస్తులుగా మారిపోయారట.  అందుకే ఆ ఫ్రెండ్ షిప్ తోనే నిన్న జెనీలియా జన్మదిన వేడుకలకు హాజరయ్యాడు.  జెనీలియా బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ముఖ్ ను వివాహమడిన సంగతి తెలిసిందే.  జెనీలియా -రితీష్ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నిన్న జరిగిన బర్త్ డే పార్టీ నుంచి రామ్ ఒక ఫోటో పోస్ట్ చేస్తూ "స్వీటెస్ట్.. బెస్టెస్ట్.. క్యూటెస్ట్ జెనీలియా కు వెరీ హ్యాపీ బర్త్ డే'.  నువ్వు మా అందరి జీవితాల్లో ఒక బ్లెస్సింగ్.  నీకు ఈ ఏడాది బెస్ట్ గా ఉండాలి జెను.  నోట్:  ఇస్మార్ట్ రితేష్ దేశ్ ముఖ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ ఫోటోలో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' స్టైల్ ను అనుకరిస్తూ రితీష్ దేశ్ ముఖ్ కర్చీఫ్ ను చేతికి కట్టుకొని.. కర్చీఫ్ చివరను పంటి కింద పెట్టుకొని ఓ ఇంటెన్స్ లుక్ ఇచ్చాడు. టపోరి లుక్ నుండి మారిపోయి రామ్ డీసెంట్ హీరోగా కనిపిస్తుండగా ఎప్పుడూ డీసెంట్ గా కనిపించే రితేష్ ఇస్మార్ట్ హీరోలా మారడం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక జెనీలియా మాత్రం తనదైన స్టైల్ లో ఫుల్ గా నవ్వేస్తూ పోజిచ్చింది.
Tags:    

Similar News