వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కెరీర్ కి కొత్త ఊపు తెచ్చిన చిత్రంగా ‘నేను శైలజ’ నిలిచింది. అంతకుముందు వచ్చిన రామ్ సినిమాలన్నీ ఒకే మూసలో ఉంటూ వచ్చాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలాంటి రొటీన్ మాస్ మసాలా ఫార్మాలకు కాస్త భిన్నంగా, పక్కింటి కుర్రాడిలా ‘నేను శైలజ’లో నటించాడు. దాంతో రామ్ నటన అందరికీ నచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే... ఈ చిత్రంతో తన అభిమానులు చాలామంది అసంతృప్తి చెందారని రామ్ చెబుతున్నాడు! తన నుంచి అభిమానులు ఆశించింది అందులో దక్కలేదని, అందుకే చాలామంది డిజపాయింట్ అయ్యారని రామ్ అంటున్నాడు.
నేను శైలజ చిత్రం జనాలకు బాగానే నచ్చినా, ఎనర్జిటిక్ గా రామ్ అందులో కనిపించకపోయేసరికి కొంతమందికి కాస్త అసంతృప్తి కలిగిందని రామ్ చెబుతున్నాడు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులు రెండు రకాలుగా ఉంటారని రామ్ చెప్పాడు. కొంతమంది ప్రేక్షకులు మాత్రమే వైవిధ్యమైన సినిమాలను కోరుకుంటారనీ, చాలామంది అలాంటి కథాకథనాలతో కనెక్ట్ కాలేరని రామ్ విశ్లేషించాడు! తాను తెరమీద ఎనర్జిటిక్ గా ఉంటేనే చూసేందుకు చాలామంది ఇష్టపడతారనీ, హీరోయిజమ్ ఎలివేట్ చేసే పాత్రల్లోనే తాను కనిపించాలని కోరుకుంటారనీ, ఎనర్జిటిక్ గా కనిపిస్తే తప్ప వాళ్ల ఇగోలు సంతృప్తిపడవని రామ్ అన్నాడు.
త్వరలో విడుదల కాబోతున్న ‘హైపర్’లో మరోసారి ఎనర్జిటిక్ పాత్రలో నటించానని చెబుతున్నాడు. అలాగని రొటీన్ ఫార్ములా ప్రకారం ఈ సినిమా ఉండదని చెబుతున్నాడు. అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఈ చిత్రం ద్వారా ఇస్తున్నామని, అన్ని కమర్షియల్ హంగులూ ఈ చిత్రంలో ఉన్నాయని రామ్ వివరించాడు. ఈ సినిమాకి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోతారని అంటున్నాడు. మొత్తానికి... రామ్ ఎనర్జిటిక్ ఫార్ములా రూట్లోకి మళ్లీ వచ్చేశాడన్నమాట!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/