మొదటి నుంచి కూడా రానా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. కేవలం తాను హీరో పాత్రలను మాత్రమే చేస్తానని కూర్చోకుండా ఆయన ముందుకు వెళుతున్నాడు. తనకి నచ్చితే ఎలాంటి పాత్రైనా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
అలా ఆయన చేసిన సినిమానే 'విరాటపర్వం'. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సాయిపల్లవి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా 'ఆత్మీయ వేడుక'లో రానా మాట్లాడుతూ .. "ఇందాక తరుణ్ భాస్కర్ గారు అడిగినట్టే .. చాలామంది నన్ను అడుగుతున్నారు. సార్ .. ఈ సినిమాను మీరు ఎందుకు చేస్తున్నారు? ఏదైనా పెద్ద యాక్షన్ మూవీ చేయవచ్చును గదా అని అడిగారు. చాలాసార్లు చాలామంది సినిమాలు ఎందుకు చేస్తారంటే ఇలాంటి చప్పట్ల కోసమో .. విజిల్స్ కోసమో .. ఫ్యాన్స్ కోసమో చేస్తారు. కానీ ఈ సినిమాను నేను ఎందుకోసం చేశానో చెబుతాను.
ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చుని .. దీనమ్మా ఇది నిజమే కదా అని ఒకడు నమ్మి చూస్తుంటాడు .. ఆ ఒక్కడి కోసమే ఈ సినిమాను చేశాను. అంత రియల్ గా .. అంత అద్భుతంగా వేణు ఈ సినిమాను రూపొంచాడు.
ఇందాక వేణుగారు మాట్లాడుతూ .. తెలంగాణలో కట్టే పుల్లను పట్టుకున్నా కవిత్వం వస్తుందని అన్నారు. అది ముమ్మాటికీ నిజం. ఇలాంటి తెలంగాణ కథలను ఇంకా ఎన్నో చెప్పదలచుకున్నాం.
ఈ సినిమా ఈ నెల 17వ తేదీన వస్తుంది. మీ లవ్ మా అందరికీ కావాలి. మీ డబ్బులను 'విరాటపర్వం' సినిమా కోసం సేవ్ చేసుకోండి. ఈ సినిమాను తప్పకుండా చూడండి .. సక్సెస్ మీట్ ను మళ్లీ ఇక్కడే చేసుకుందాం' అంటూ ముగించాడు. నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి మరి.Full View
అలా ఆయన చేసిన సినిమానే 'విరాటపర్వం'. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సాయిపల్లవి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా 'ఆత్మీయ వేడుక'లో రానా మాట్లాడుతూ .. "ఇందాక తరుణ్ భాస్కర్ గారు అడిగినట్టే .. చాలామంది నన్ను అడుగుతున్నారు. సార్ .. ఈ సినిమాను మీరు ఎందుకు చేస్తున్నారు? ఏదైనా పెద్ద యాక్షన్ మూవీ చేయవచ్చును గదా అని అడిగారు. చాలాసార్లు చాలామంది సినిమాలు ఎందుకు చేస్తారంటే ఇలాంటి చప్పట్ల కోసమో .. విజిల్స్ కోసమో .. ఫ్యాన్స్ కోసమో చేస్తారు. కానీ ఈ సినిమాను నేను ఎందుకోసం చేశానో చెబుతాను.
ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చుని .. దీనమ్మా ఇది నిజమే కదా అని ఒకడు నమ్మి చూస్తుంటాడు .. ఆ ఒక్కడి కోసమే ఈ సినిమాను చేశాను. అంత రియల్ గా .. అంత అద్భుతంగా వేణు ఈ సినిమాను రూపొంచాడు.
ఇందాక వేణుగారు మాట్లాడుతూ .. తెలంగాణలో కట్టే పుల్లను పట్టుకున్నా కవిత్వం వస్తుందని అన్నారు. అది ముమ్మాటికీ నిజం. ఇలాంటి తెలంగాణ కథలను ఇంకా ఎన్నో చెప్పదలచుకున్నాం.
ఈ సినిమా ఈ నెల 17వ తేదీన వస్తుంది. మీ లవ్ మా అందరికీ కావాలి. మీ డబ్బులను 'విరాటపర్వం' సినిమా కోసం సేవ్ చేసుకోండి. ఈ సినిమాను తప్పకుండా చూడండి .. సక్సెస్ మీట్ ను మళ్లీ ఇక్కడే చేసుకుందాం' అంటూ ముగించాడు. నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి మరి.