అమితంగా ఇష్టపడే వారిపై ప్రేమను చూపించేందుకు చాలా మంది ఒంటిపై పచ్చబొట్టు వేయించుకుంటారు. తాము మట్టిలో కలిసిపోయేంత వరకు వారిపై ప్రేమ, అభిమానం తమతోనే ఉండిపోతాయని పరోక్షంగా చాటి చెప్పడం దాని ఉద్దేశం.
ఈ విధంగా ఎంతో మంది టాటూలు వేయించుకుంటారు. ఇక, సెలబ్రిటీల గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది ఒళ్లంతా డిజైన్లు నింపేసుకుంటారు. అయితే.. టాలీవుడ్ హీరో రానా కూడా పచ్చబొట్టు వేయించుకున్నారట. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు.
అయితే.. ఎప్పుడు వేయించుకున్నారో తెలియదుగానీ.. ఇప్పుడు అది తొలగిపోతే బాగుండు అని అంటున్నారట. 'మీరు పచ్చబొట్టు వేయించుకోవాల్సి వస్తే.. ఎవరి పేరు వేయించుకుంటారు' అని అడిగితే.. ముందుగా తన ఒంటిమీద ఉన్నది తీసేసే మార్గం చెప్పండి అంటున్నాడట దగ్గుబాటి వారసుడు.
మరి, అది ఒంటిపై ఎక్కడ ఉంది? అంటే మాత్రం సీక్రెట్ అని చెబుతున్నాడట. పోనీ.. అది ఎవరి పేరు? అన్నదానికి కూడా డబుల్ సీక్రెట్ అంటున్నాడట. దీంతో.. అది ఎవరిపేరై ఉండొచ్చు? అని చర్చించుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. నిజంగా అది ఎవరి పేరు అన్నది ఆ 'రామానాయుడి'కే తెలియాలి. అదేనండీ.. షార్ట్ కట్ రానాకి!