బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. అక్షయ్ కుమార్.. అమీర్ ఖాన్ లు ఒక్కో సినిమా కు 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు అంటూ ఓ పదేళ్ల క్రితం మాట్లాడుకుని అంతా ముక్కున వేలేసుకున్నారు. కట్ చేస్తే సౌత్ లో చాలా మంది హీరోలు కూడా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. వంద కోట్ల పారితోషికం ను ఇండియన్ సినీ ప్రేమికులు చాలా గొప్ప విషయం గా చెప్పుకుంటున్నారు.
ఇండియన్ సినీ ఇండస్ట్రీ లో వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోలు పది మంది కంటే తక్కువే. ప్రస్తుతం సినిమాల పరిస్థితి సరిగా లేదు.. బడ్జెట్ తగ్గించడం కోసం హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒక హీరో ఏకంగా రూ.800 కోట్లు పారితోషికం గా తీసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలు ప్రతి ఒక్కరికి షాకింగ్.
అంత భారీ పారితోషికం తీసుకుంటున్న హీరో మరెవ్వరో కాదు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్. ఈయన ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ సినిమా లు చేస్తున్నాడు. ఆ సినిమాలకు నామమాత్రపు పారితోషికం ను అందుకుంటున్నాడట. ఎందుకంటే విడుదలైన తర్వాత లాభాల్లో వాటాను ఈయన కోరుకుంటున్నాడట.
ఈయన గత చిత్రం టాప్ గన్ మావేరిక్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 1.2 బిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిందట. భారత కరెన్సీ లో రూ.9600 కోట్ల ను టాప్ గన్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సాధించిన వసూళ్లలో టాప్ క్రూజ్ కు భారీ మొత్తంలో వాటాగా ఇవ్వడంతో ఆయన పారితోషికం గా దాదాపుగా 100 మిలియన్ల డాలర్ల ను దక్కించుకున్నాడట.
టాప్ గన్ సినిమా కు గాను టామ్ క్రూజ్ తీసుకున్న పారితోషికం ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే దాదాపుగా రూ.800 కోట్లు. ఇంత భారీ మొత్తంను ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ స్టార్ తీసుకున్నదే లేదు.
ప్రస్తుతం చేస్తున్న మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ సినిమా లకు గాను ఈయన అందుకోబోతున్న పారితోషికం వెయ్యి కోట్లకు పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.