విజయ్ దేవరకొండకు ఈ టైటిలే దొరికిందా?

Update: 2019-03-04 09:37 GMT
చాలా తక్కువ టైంలో ఊహించని రేంజ్ లో స్టార్ డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ డిమాండ్ మాములుగా లేదు. తన కాల్ షీట్స్ కావాలంటే స్టార్ హీరో తరహాలో నిర్మాతలు వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది . ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్న విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే కథలతో పాటు టైటిల్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బెటరని అభిమానులు సూచిస్తున్నారు. కారణం లేకపోలేదు.

విజయ్ దేవరకొండ త్వరలో తమిళ్ తెలుగులో రూపొందే ఓ బైలింగ్వల్ మూవీలో నటించబోతున్నాడు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోందట. అంతా ఓకే కాని దీనికి టైటిల్ హీరో అని ఫిక్స్ చేసినట్టు చెన్నై టాక్. అఫీషియల్ గా చెప్పిన న్యూస్ కాదు కాని కథ ప్రకారం హీరో ఇందులో ప్రొఫెషనల్ బైకర్ గా కనిపిస్తాడు. హీరో టైటిల్ అయితేనే సరిపోతుందని యూనిట్ భావిస్తున్నారట.

నిజానికి హీరో అనేది సౌత్ లో అంతగా అచ్చి రాని టైటిల్. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం చిరంజీవితో హీరో అనే సినిమా వచ్చింది. ఫలితం డిజాస్టర్. అంత పాతది ఎందుకులే అనుకుంటే కొన్నేళ్ళ క్రితం నితిన్ చేసిన హీరో మూవీ వచ్చింది. కనీసం ఈ పేరుతో నితిన్ ఓ సినిమా చేసాడు అని గుర్తుపట్టేలోగానే థియేటర్లలో మాయమైపోయింది. తర్వాత ఎవరూ టచ్ చేయలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండకు  హీరో టైటిల్ అంటే అభిమానులకు టెన్షన్ కలగడంలో ఆశ్చర్యం లేదుగా



Tags:    

Similar News