తమిళంలో ప్రస్తుతం విజయ్ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు. ఈయన చేసిన దాదాపు అన్ని సినిమాలు ఈజీగా 150 నుండి 200 కోట్లను వసూళ్లు చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో అన్ని సినిమాలు వసూళ్లు చేస్తున్న నేపథ్యంలో విజయ్ నటించే ప్రతి సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. ప్రస్తుతం ఈయన అట్లీ దర్శకత్వంలో తన 63వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఫుట్ బాల్ నేపథ్యంలో ఉంటుందనే విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం దాదాపు ఆరు కోట్లతో ఒక భారీ ఫుట్ బాల్ స్టేడియంను దర్శకుడు వేయించాడట. అట్లీ దర్శకత్వంలో గతంలో విజయ్ నటించిన చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అందుకే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రం కూడా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో ఈ సినిమా కథ తనది అంటూ ఒక యువ దర్శకుడు మీడియా ముందుకు వచ్చాడు. మహిళ ఫుట్ బాల్ నేపథ్యంలో నేను రాసుకున్న కథను అట్లీ కుమార్ కాపీ కొడుతున్నాడని ఆ దర్శకుడు ఆరోపిస్తున్నాడు. తన కథను నిర్మించాల్సిందిగా చాలా మంది నిర్మాతలను కోరారు. ఎంతో మంది కథను విన్నారు. అయితే అందులో ఏ నిర్మాతో నా కథను అట్లీకి చెప్పి ఉంటాడు, ఆ కథను తన కథగా మల్చుకుని సినిమా తీస్తున్నాడు అంటూ ఆ దర్శకుడు చెబుతున్నాడు.
కథ నాది అంటూ రచయితల సంఘంను నేను ఆశ్రయించినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దాంతో కేసు వరకు వెళ్లాల్సి వచ్చిందని అతడు చెబుతున్నాడు. నా కథతో సినిమాను తీస్తున్న అట్లీ కుమార్ నా ఆవేదనను పట్టించుకోవడం లేదని, అసలు మాట్లాడేందుకు కూడా టైం ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. విజయ్ కూడా పలు సార్లు కలిసేందుకు ప్రయత్నించినా కూడా నో చెప్పాడు. అందుకే నా కథ కోసం నేను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అతడు అంటున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ వివాదంపై అట్లీ కాని, విజయ్ కాని స్పందించలేదు. అతడు చెప్పేదాంటో నిజం ఎంత ఉందో అనే విషయమై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో మెర్సల్ చిత్రం కథ కూడా కాపీ అంటూ ప్రచారం జరిగింది. మరి ఈ సమస్య నుండి విజయ్ ఎలా బయట పడతాడో చూడాలి. ఇటీవలే ఈ చిత్రం ఎలాంటి వివాదం లేకుండా ఉంటుందని, ఇందులో రాజకీయాలు ఉండవని విజయ్ అన్నాడు. ఆయన వివాదం ఉండని చెప్పిన కొన్ని రోజులకే కథ వివాదం మొదలవ్వడం జరిగింది.