మ‌హిళా ఫుట్ బాల్ కోచ్ ద‌ళ‌ప‌తి

Update: 2019-01-22 04:39 GMT
ఇల‌య‌ద‌ళ‌పతి విజ‌య్ రూటు మార్చాడా?  ఊర‌మాసు యాక్ష‌న్ సినిమాల‌తో బోర్ ఫీల‌య్యాడా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. గ‌డిచిన నాలుగేళ్ల‌లో న‌టించిన‌వాటిలో.. తేరి, భైర‌వ‌, మెర్స‌ల్, స‌ర్కార్ .. ఇవ‌న్నీ ఊర మాస్ యాక్ష‌న్ సినిమాలే. కెరీర్ లో మెజారిటీ పార్ట్ అన్నీ మాస్ ని దృష్టిలో పెట్టుకుని న‌టించిన‌వే. అందుకు త‌గ్గ‌ట్టే హిట్లు, బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాడు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత పెద్ద స్టార్ అని నిరూపించుకుంటున్నాడు విజ‌య్. కానీ అత‌డిలో ఏదో అసంతృప్తి. అందుకే ఇప్పుడు ఈ ఛేంజ్!

రొటీన్ గా వెళితే క‌ష్టం ఎక్క‌డైనా. నేటిత‌రం ఆడియెన్ కొత్త‌ద‌నం కోరుకుంటున్నాడు. ఈ సంగ‌తిని ప‌సిగ‌ట్టాడో ఏమో ద‌ళ‌ప‌తి రూటు మార్చాడు. ఈసారి ఓ కొత్త పంథా క‌థ‌ని ఎంచుకున్నాడు. అది కూడా `తేరి`, `స‌ర్కార్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను త‌న కెరీర్ కి ఇచ్చిన అట్లీతో ఈసారి కొత్త క‌థ‌ని రాయించాడు. ఇల‌య‌ద‌ళ‌ప‌తి 63గా చెబుతున్న ఈ సినిమా నిన్న‌నే ప్రారంభ‌మైంది. ఈ సినిమా క‌థాంశంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ద‌ళ‌ప‌తి 63లో విజ‌య్ ఫుట్ బాల్ కోచ్‌ గా క‌నిపించ‌నున్నాడు. అది కూడా మ‌హిళా ఫుట్ బాల్ టీమ్ కి కోచ్ గా క‌నిపిస్తాడ‌ట‌. ఇక ఈ చిత్రంలో ల‌క్కీ ఛామ్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోంది. న‌య‌న్ ఇప్ప‌టికే విజ‌య్ స‌ర‌స‌న  విల్లు అనే చిత్రంలో న‌టించింది. మ‌రోసారి తాజాగా ఛాన్స్ ద‌క్కించుకుంది. ఈ క్రేజీ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అన్న అంచ‌నా ఏర్ప‌డింది ఇప్ప‌టికే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అన‌గానే షారూక్ చ‌క్ దే ఇండియా, మాధ‌వ‌న్ సాలా ఖ‌డూస్ చిత్రాలు గుర్తుకొస్తాయి. షారూక్ హాకీ కోచ్ గా న‌టిస్తే, మ్యాడీ లేడీ బాక్స‌ర్ కి కోచ్ గా న‌టించాడు. చ‌క్ దే ఇండియా, సాలా ఖుడూస్ ఫ‌క్తు స‌క్సెస్‌ ఫార్ములాతో తెర‌కెక్కాయి. ఆ సినిమాల్లో కోచ్ ల‌కు మంచి పేరొచ్చింది. అందుకే ఇప్పుడు ఇల‌య‌ద‌ళ‌ప‌తి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీపై మ‌న‌సు పారేసుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఆడియెన్ లో మారిన అభిరుచికి త‌గ్గ‌ట్టే విజ‌య్ ప్లాన్ చేశాడ‌ని భావించ‌వ‌చ్చు.
   

Full View

Tags:    

Similar News