రూ.56కోట్ల ఖ‌రీదైన డూప్లెక్స్ కొన్న హీరో

Update: 2019-08-29 11:48 GMT
ముంబై- హైద‌రాబాద్ స‌హా అన్నిమెట్రో న‌గ‌రాల్లో రియ‌ల్ ఎస్టేట్ పీక్స్ లో చేరుకున్న సంగతి తెలిసిందే. మునుప‌టితో పోలిస్తే రేట్లు చాలా హై లెవ‌ల్లో మామూలు జ‌నాల‌కు అంద‌నంత‌గా పెరిగాయి. సెల‌బ్రిటీలు- ధ‌న‌స్వాములు త‌ప్ప సామాన్యులు సొంతంగా గృహాలు కొనుక్కునే సీనే లేదు. అయితే పెరిగిన ధ‌ర‌లతో అద‌నంగా జీఎస్టీ చెల్లించి సొంతిల్లు ద‌క్కించుకునే వాడిని మొన‌గాడిగా ప‌రిగ‌ణించాలి. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ పేరు చేరింది.

ముంబైలో రిచెస్ట్ సెల‌బ్రిటీ జ‌నం నివ‌శించే వ‌ర్లీలో షాహిద్ క‌పూర్ ఏకంగా రూ.56కోట్లు పెట్టి డూప్లెక్స్ కొనుక్కోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆకాశ‌హార్మ్యంలో 42-43 అంత‌స్తులో 8,626 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉంద‌ట‌. వ‌ర్లీ ఏరియా అంటే సీ-ఫేసింగ్ ఉండే భ‌వంతులే ఎక్కువ‌గా ఉంటాయి. ప్ర‌స్తుతం ఈ భ‌వంతి నిర్మాణంలో ఉంద‌ని తెలుస్తోంది. స‌ముద్రపు అల‌లు క‌నిపించే వైపుగా 10 కార్లు పార్కింగ్ చేసుకునేంత ఖాళీ స్థ‌లం షాహిద్ డూప్లెక్స్ కి అందుబాటులో ఉంద‌ట‌. దీనిని రిట్స్ క‌ర్ల్ ట‌న్ అనే ప్ర‌ఖ్యాత రియ‌ల్ట‌ర్ కంపెనీ నిర్మిస్తోంది.

షాహిద్ ఒక్క‌డేనా?  కొమ్ములు తిరిగిన మొన‌గాడు అంటే.. ఈ హీరో త‌ల‌ద‌న్నే దిగ్గ‌జాలెంద‌రో ఈ భ‌వంతిలో సొంతంగా డూప్లెక్సులు కొనుక్కున్నారు. కిలాడీ అక్ష‌య్ కుమార్ - అభిషేక్ బ‌చ్చ‌న్ వంటి స్టార్లు ఇదే భ‌వంతిలో ఇప్ప‌టికే అడ్వాన్సులిచ్చి మ‌రీ బుక్ చేసుకున్నారు. వంద‌ల కోట్లు వెద‌జ‌ల్లి సీఫేసింగ్ లో అపార్ట్ మెంట్లు కొనుక్కుంటున్న సెల‌బ్రిటీల్ని స్వ‌ర్గంలో దేవ‌త‌ల‌తో స‌మానంగా చూడాలి క‌దూ?

    

Tags:    

Similar News