ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత చాలా కనిపిస్తుంది. మన తెలుగులో ముఖ్యంగా టాప్ హీరోలకు, సీనియర్ హీరోలకు ఈ ప్రాబ్లెమ్ ఎదురవుతుంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టమవుతుంది. యంగ్ హీరోలకు సీనియర్ హీరోయిన్లు కూడా సూట్ అవుతున్నారు. కానీ సీనియర్ హీరోలకు కాజల్, త్రిష, నయనతార, తమన్నా లాంటి సీనియర్లు కూడా సరైన జోడిగా కన్పించడం లేదని సినీ వర్గాలు, అభిమానులు వాపోతున్నారు.
తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ లాంటి సీనియర్ హీరోలకు ఇదే సమస్య. తమిళ్ సీనియర్ హీరోలలో ఒకడైన ఇళయ దళపతి విజయ్ కి, టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి హీరోయిన్ల ప్రాబ్లెమ్ లేదు. ఎందుకంటే వాళ్లకు మొన్నటి సీనియర్ల దగ్గర నుండి నేటి రష్మిక మందన వరకు జోడీలుగా సెట్ అవుతున్నారు. తాజాగా ఆచార్య షూటింగులో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ లకు చుక్కలు చూపిస్తుందట. మొన్నటి అజ్ఞాతవాసిలో కూడా పవన్ సరసన కీర్తిసురేష్, అను ఇమ్మానుయేల్ లను తీసుకోగా జోడీలు దెబ్బకొట్టిన విషయం తెలిసిందే.
చిన్న హీరోలకు ఎలాంటి తిప్పలు లేవు, సీనియర్ హీరోలకే ఈ ఇబ్బందులు రావడంతో అటు హీరోలు అభిమానులను మెప్పించలేక, అభిమానులు సూట్ అవ్వని జోడిలను చూడలేక నానా తంటాలు పడుతున్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చర్చకు దారితీస్తుంది. దర్శక నిర్మాతలు కూడా జంటగా కనిపించే హీరోయిన్లను వెతికే పనిలో పడాలని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.