హీరోయిన్ తో విద్యార్ధి మిస్ బిహేవ్… రియాక్ట్ అయిన నటి

Update: 2023-01-21 04:04 GMT
ఆకాశం నీ హద్దురా సినిమాలో సూర్యకి జోడీగా నటించిన నటి అపర్ణా బాలమురళీ తమిళ్, మలయాళీ బాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మిగిలిన నటీమణులకి భిన్నంగా ట్రెడిషనల్ లుక్ లో ఈ బ్యూటీ కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా తాజాగా  ఈ బ్యూటీ తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఉన్న ప్రభుత్వ లా కాలేజీకి వెళ్ళింది. అక్కడ స్టూడెంట్స్ తో మీట్ అయ్యింది. అయితే మీటింగ్ జరుగుతూ ఉండగా ఒక లా స్టూడెంట్ స్టేజ్ మీదకి వచ్చి ఆమెకి ఫ్లవర్ ఇచ్చాడు. దానిని ఆమె తీసుకుంది.

అయితే ఆ యువకుడు బలవంతంగా హీరోయిన్ చేయి పట్టుకొని ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరకి తీసుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అపర్ణా బాలమురళీ కాస్తా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యింది. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ ఘటనపై అపర్ణా బాలమురళీ స్పందించింది. తాను కాలేజీకి వెళ్లి సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సమయంలో ఆ  యువకుడు చేసిన పని నన్ను బాధించింది అని తెలిపింది.

నా చేయి పట్టుకొని బలవంతంగా కుర్చీలోంచి పైకి లేపాడు. నా ప్రమేయం లేకుండానే నా భుజం మీద చేయి వేసే ప్రయత్నం చేశాడు. ఒక మహిళా పర్మిషన్ లేకుండా ఎలా భుజం మీద చేయి వేస్తాడు.

ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. అయితే ఆ ఘటనపై పోలీసులకి ఫిర్యాదు చేసే అంత సమయం లేదని తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన తర్వాత కళాశాల సిబ్బంది అపర్ణకి క్షమాపణలు చెప్పారని తెలియజేసింది. అలాగే ఆ విద్యార్ధిని వారం రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై న్యాయ కళాశాల విద్యార్ధి సంఘం క్షమాపణలు తెలియజేసింది. లా కాలేజీలో నటిగా ఇలాంటి ఘటన జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్ధిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో ఈ ఘటనకి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకా కొనసాగుతుందా అనేది మాత్రం చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News