రస్నా బేబీగా అంకిత ఝవేరీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ అయ్యింది. కథానాయికగా ఈమె మొదటి చిత్రం వై.వి.ఎస్.చౌదరి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'లాహిరి లాహిరి లాహిరిలో'. ఆ తరువాత ఎన్టీఆర్ 'సింహాద్రి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించింది. అయితే కొత్త కథనాయికల వెల్లువలో అవకాశాలు తగ్గటంతో అటుపై చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది. ఐటమ్ నంబర్ లోనూ నర్తించింది.
అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. తండ్రి గుజరాతీ.. తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ ముంబైకి చెందిన అంకిత కుటుంబం తనను సినిమాలలో నటించేందుకు ప్రోత్సాహించింది. ముంబైలోని హెచ్.ఆర్.కళాశాలలో బీ.కాం పూర్తి చేసిన అంకిత మూడేళ్ల వయసులో రస్నా వ్యాపార ప్రకటనలో నటించి రస్నాబేబీగా ప్రసిద్ధి చెందింది. రస్నా ప్రకటన తర్వాత అంకిత వీడియోకాన్ తదితర అనేక వ్యాపార ప్రకటనలలో నటించింది. 2002లో వై.వి.చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం హీరోయిన్ను వెతకడానికి ముంబై వెళ్ళినప్పుడు అంకిత ఫోటోలు చూసి.. ఆమె రస్నా బేబీ రూపం నచ్చడంతో ఆ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా విజయవంతమవ్వటంతో తెలుగులో వెనువెంటనే అనేక సినిమా అవకాశాలు వచ్చాయి.
లాహిరి లాహిరి లాహిరిలో తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ సినిమాలో అంకిత నటనకు మన్ననలు పొందింది. దాంతో జూనియర్ ఎన్టీయార్ సరసర సింహాద్రిలో నటించే అవకాశం వచ్చింది. సింహాద్రి విజయవంతమవటంతో అంకితకు అనేక సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కొన్ని చెత్త సినిమాలు చేయటం వల్ల తెలుగు సినీరంగంలో వెనకబడిపోయింది. సినిమాల మధ్యలో వచ్చిన ఖాళీ సమయంలో ఆర్నెళ్ల పాటు లండన్ వెళ్ళి అక్కడ సినీ దర్శకత్వంలో డిప్లొమా పొంది తిరిగివచ్చింది. కానీ అంకిత ప్రయత్నాలేవీ సరిగా ముందుకు సాగలేదు.
ఆ తరవాత అంకిత ఓ బిజినెస్ మేన్ ని పెళ్లాడి విదేశాల్లో సెటిలయ్యారు. ప్రస్తుతం తన పిల్లలు భర్తతో హాయిగా సంసార జీవనంలో కొనసాగుతోంది. తెలుగు తమిళంలో దాదాపు 20 సినిమాల్లో నటించిన అంకిత గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచానికి దూరంగా న్యూజెర్సీలో తన భర్త కొడుకుతో హ్యాపీగా నివశిస్తోంది.
అయితే ఇటీవలే ఇండియాలో అడుగుపెట్టిన అంకిత ఇదిగో ఇలా బన్నీతో కలిసి కనిపించింది. అంతేకాదు.. బన్నీ తనని రిసీవ్ చేసుకున్న తీరుకు ఫిదా అయిపోయింది. "ఎవరైనా ఒక స్టార్ అన్నివేళలా మంచి క్వాలిటీస్ తో వినయవిధేయతలు ఒదిగి ఉండే స్వభావంతో షైన్ అవుతారు.
ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగారు? అన్నది కాదు.. ఎవరు ఎంత హంబుల్ గా ఉన్నారు? అన్నదే నిర్ణయిస్తుంది" అంటూ అంకిత ఎమోషనల్ గా పోస్ట్ చేసారు. #embracetollywood అనే హ్యాష్ ట్యాగ్ ని ఈ ఫోటోకి జోడించారు. సినిమాలకు దూరమవ్వడంతో అంకిత రూపం పూర్తిగా మారిపోయింది. బబ్లీ మామ్ లుక్ తో ఇలా కనిపించింది. ఒకవేళ తిరిగి సినిమాల్లో క్యారెక్టర్ నటిగా షైన్ అవుతుందేమో చూడాలి.