ఇటీవల హీరోయిన్ లు విలన్ లని ప్రేమించడం, పెళ్లి కి రెడీ అవుతున్న తీరు నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా కన్నడ హీరోయిన్ హరి ప్రియ 'కెజీఎఫ్' విలన్ వశిష్ట సింహాతో ప్రేమ, పెళ్లికి రెడీ అయిపోయి తాజాగా ఎంగేజ్ మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. గత కొంత కాలంగా డేటింగ్ లో వున్న ఈ జంట సడన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఇదే తరహాలో మరో హీరోయిన్ విలన్ తో ప్రేమలో వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
'ప్రేమమ్' ఫేమ్ హీరో నవీన్ పాలి నటించిన ఓ మలయాళ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది ఐశ్వర్యా మీనన్. విశాల్ నటించిన 'యాక్షన్' మూవీతో తమిళంలోనూ అరంగేట్రం చేసిన ఐశ్వర్య లక్ష్మీ .. ఇటీవల సత్యదేవ్ నటించిన 'గాడ్సే' మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. అమ్ము, మట్టి కుస్తీ, మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్ 1'తో పాటు పార్టు 2లోనూ నటిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న ఐశ్వర్మ లక్ష్మీ గత కొంత కాలంగా ఓ విలన్ తో ప్రేమలో వుందట.
ఆ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి క్లారిటీ ఇచ్చేసింది. అతనితో కలిసి వున్న ఓ ఫోటోని షేర్ చేసిన ఐశ్వర్య లక్ష్మి అతనితో ప్రేమలో వుందని జరుగుతున్న ప్రచారం నిజమేని స్పష్టం చేసింది.
తను షేర్ చేసిన ఫొటోకు లవ్ సింబల్ ని పోస్ట్ చేసి తను ప్రేమలో వున్నానని క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఐశ్వర్య లక్ష్మి డేటింగ్ చేస్తున్న విలన్ ఎవరో కాదు తమిళ నటుడు అర్జున్ దాస్. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విలన్ ఛాయలున్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.
'కప్పెల' ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న 'బుట్టబొమ్మ' మూవీతో అర్జున్ దాస్ తెలుగులో అడుగు పెడుతున్నాడు. ఇదిలా వుంటే ఐశ్వర్య లక్ష్మి షేర్ చేసిన ఫొటోని చూసిన నెటిజన్ లు కొంత మంది కంగ్రాట్స్ చెబుతుంటే మరి కొంత మంది మాత్రం ఇది ఏ సినిమాలోని ఫొటో, ఇద్దరు కలిసి ఏదైనా సినిమా కోసం నటించబోతున్నారా? అందుకే ఈ ఫొటోని షేర్ చేశారా? అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిరిచ్చిన పెళ్లిపై ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మీకు ప్రేమ పెళ్లి ఇష్టమా? .. లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టమా? అని ప్రశ్నిస్తే .. తనకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని వెల్లడించి షాకిచ్చింది. అలా మాట్లాడిన ఐశ్వర్య నెల రోజులు తిరక్కుండానే ఇలా అర్జున్ దాస్ ఫొటోని షేర్ చేయడం దానికి లవ్ సింబల్ ని క్యాప్షన్ గా పెట్టడం నెటిజన్ లని ఆశ్చర్యానికి గురిచేస్తోందట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.